Site icon Prime9

Bihar Caste Survey: బీహార్ లో ఏ కులంలో పేదరికం ఎక్కువగా ఉందో తెలుసా?

Bihar Caste Survey

Bihar Caste Survey

Bihar Caste Survey:బీహార్ రాష్ట్రంలో ఇటీవల నిర్వహించిన కులాల సర్వే ఆధారంగా ప్రజల సామాజిక మరియు ఆర్థిక స్థితిగతులపై ప్రభుత్వం మంగళవారం డేటాను విడుదల చేసింది. . డేటా ప్రకారంఅగ్రవర్ణాల్లో భూమిహార్లలో పేదరికం ఎక్కువగా ఉంది. బీహార్‌లో 27.58 శాతం భూమిహార్లు ఆర్థికంగా బలహీనంగా ఉన్నారని డేటా పేర్కొంది.

భూమిహార్లలో ఎక్కువగా పేదరికం..(Bihar Caste Survey)

బీహార్ లో భూమిహార్ కులానికి చెందిన కుటుంబాలు కనీసం 8,38,447 ఉన్నాయి, వాటిలో 2,31,211 ఆర్థికంగా బలహీన వర్గానికి చెందినవిగా రాష్ట్ర ప్రభుత్వ నివేదిక పేర్కొంది. హిందూ అగ్రవర్ణాలలో పేదరికంలో బ్రాహ్మణులు రెండవ స్థానంలో ఉన్నారు. డేటా ప్రకారం, బ్రాహ్మణ కుటుంబాల్లో కనీసం 25.32 శాతం పేదలు. బీహార్‌లో బ్రాహ్మణ కులానికి చెందిన మొత్తం 10,76,563 కుటుంబాలు ఉండగా, అందులో 2,72,576 మంది పేదలు ఉన్నారు.సాధారణ కేటగిరీలో పేదరికంలో రాజ్‌పుత్‌లు మూడో స్థానంలో ఉన్నారు. కుల గణన నివేదిక ప్రకారం, రాజ్‌పుత్‌లలో 24.89 శాతం జనాభా పేదలు. ప్రభుత్వ నివేదిక ప్రకారం, బీహార్‌లో 9,53,447 రాజ్‌పుత్ కుటుంబాలు ఉన్నాయి, అందులో 2,37,412 మంది పేదలుగా పరిగణించబడ్డారు.

అత్యంత సంపన్నకులంగా కాయస్దలు..

అదే సమయంలో, కాయస్థలు అత్యంత సంపన్నమైన కులంగా వర్ణించబడ్డారు. డేటా ప్రకారం రాష్ట్రంలో 13.83 శాతం మంది కాయస్థులు మాత్రమే పేదలు. బీహార్‌లో మొత్తం కాయస్థ కుటుంబాల సంఖ్య 1,70,985. వీరిలో 23,639 కుటుంబాలు మాత్రమే పేదలని కుల గణన నివేదిక పేర్కొంది.షేక్, పఠాన్ మరియు సయ్యద్ అనే మూడు ముస్లిం కులాల ఆర్థిక ఖాతాలను కూడా ప్రభుత్వం ఇచ్చింది. ముస్లింలలో వీరిని అగ్రవర్ణంగా పరిగణిస్తారు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం, షేక్ కులానికి చెందిన 25.84 శాతం మంది పేద వర్గానికి చెందినవారు. షేక్ కులానికి చెందిన మొత్తం 10,38,88 కుటుంబాలు ఉండగా, అందులో 2,68,398 కుటుంబాలు పేదలే. అదే సమయంలో పఠాన్ కులానికి చెందిన కుటుంబాల్లో 22.20 శాతం పేదలే. ప్రభుత్వ నివేదిక ప్రకారం, సయ్యద్ కులానికి చెందిన 17.61 శాతం కుటుంబాలు పేదలుగా పరిగణించబడుతున్నాయని డేటా పేర్కొంది.

ఇలా ఉండగా బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కుల గణన ఫలితాల నేపథ్యంలో వెనుకబడిన తరగతులు మరియు అత్యంత వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్‌లను మరింత పెంచాలని అన్నారు.వెనుకబడిన తరగతుల కోటాను 50 శాతం నుంచి 65 శాతానికి పెంచాలని, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు (ఈడబ్ల్యూఎస్) 10 శాతం.. వాటిని కలిపి 75 శాతానికి పెంచాలని నితీశ్ కుమార్ చెప్పారు.

Exit mobile version
Skip to toolbar