Devaraj Gowda: కర్ణాటక రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. రాష్ర్ట బీజేపీ నాయకుడు జీ దేవరాజ్ గౌడను శుక్రవారం నాడు పోలీసులు అరెస్టు చేశారు. ఆయనను పోలీస వాహనంలో తరలిస్తుండగా కొద్ది సేపు మీడియాతో మాట్లాడారు. జెడీఎస్ రాష్ర్ట అధ్యక్షుడు, హెచ్‌డీ కుమారస్వామి, ప్రధానమంత్రి నరేంద్రమోదీ మోదీని అప్రతిష్టపాలు చేస్తే రూ.100 కోట్లు ఇస్తానని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకె శివకుమార్ ఆఫర్ చేశాడని చెప్పారు. దీనికి గాను రూ.5 కోట్లు అడ్వాన్స్ కూడా పంపాడని తెలిపారు. ఈ ఆఫర్‌ను తాను తిరస్కరించినందుకు తనపై పోలీసులు కేసు పెట్టి అరెస్టు చేశారని చెప్పాడు దేవరాజే గౌడ. జైలు నుంచి విడుదలైన తర్వాత డీకే శివకుమార్ బండారం బయటపెడతానని హెచ్చరించారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం రెపో మాపో కూలిపోతుందని జోస్యం చెప్పాడు గౌడ.
సెక్స్ పెన్ డ్రైవ్‌లు సర్క్యులేట్ చేయమన్నారు..(Devaraj Gowda)
హెచ్‌డీ కుమార స్వామి స్వయంగా తనతో ప్రజ్వల్ రేవన్న సెక్స్ పెన్ డ్రైవ్‌లు సర్క్యులేట్ చేయించాలని చెప్పాలని తనపై ఒత్తిడి పెంచారని చెప్పాడు. కాగా డికె శివకుమార్ మాత్రం ఈ పెన్ డ్రైవ్‌లను ప్రజ్వల్ రెవన్న డ్రైవర్ కార్తీక్ గౌడ నుంచి తీసుకున్నాడని.. అక్కడి నుంచి ఈ పెన్‌డ్రైవ్‌లను విచ్చలవిడిగా చాలమణిలోకి తెచ్చారని దేవరాజ్ గౌడ ఆరోపించాడు. ఈ సెక్స్ వీడియోను విస్తృతంగా ప్రచారం చేసింది మాత్రం నలుగురు మంత్రుల బృందం వారిలో ఎన్ చెలువరాయస్వామి, కృష్ణ బైర గౌడ, ప్రియాంక ఖర్గే, డికె శివకుమార్‌లని చెప్పాడు. ప్రధానమంత్రి మోదీతో పాటు హెచ్‌డీ కుమారస్వామి ఇమేజ్‌ను డ్యామెజీ చేసేందుకు ఈ నలుగురుమంత్రుల బృందం కుట్ర పన్నింది. తనకు రూ.100 కోట్ల నగదు ఆఫర్ చేయడమే కాకుండా రూ.5 కోట్లు అడ్వాన్స్ కూడా బౌరింగ్ క్లబ్ రూమ్ నంబర్ 110కి పంపించారు. ఈ డీల్ కుదిర్చేందుకు స్థానిక నాయకులు చెన్నరాయపట్టణ, గోపాల్‌స్వామి అనే ఇద్దరిని పంపారని దేవరాజ్ గౌడ్ వివరించాడు.
అట్రాసిటీ కేసులో ఇరికించారు..
రూ. 100 కోట్ల ఆఫర్‌ను తిరస్కరించడంతో తనను ఎస్‌సీ ఎస్‌టి అట్రాసిటి కేసులో ఇరికించారు. అయితే సాక్ష్యం సమకూర్చడంలో విఫలం అయ్యారు. అటు తర్వాత తనను కూడా ఈ సెక్స్ కుంభకోణంలో భాగస్వామ్యుడిని చేయాలని ప్రయత్నించి విఫలం కావడంతో తనపై రేప్‌కేసు నమోదు చేశారు. నాలుగు రోజుల పాటు తనను విచారించారు. అయినా తననుంచి ఎలా సాక్ష్యం రాబట్టలేకపోయారని గౌడ అన్నారు. శివకుమార్‌తో జరిపిన సంభాషణ ఆడియో రికార్డు ఉంది. త్వరలోనే విడుదల చేస్తాను. పోలీసు కస్టడీ నుంచి విడుదలైన తర్వాత ఆడియో టేపును బయటపెడతాను..ఈ టేపుతో కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని దేవరాజగౌడ్ నమ్మకంగా చెప్పాడు.