Divorce: ఇపుడు ఎక్కడ చూసినా ప్రీ వెడ్డింగ్ షూట్స్, బేబీ బంప్స్ షూట్స్ ట్రెండింగ్ లో ఉన్నాయి. అయితే ఈ ప్రీ వెడ్డింగ్ షూట్స్ లో కూడా కొన్ని మరీ వింతగా ఉంటున్నాయి. ఇలా కూడా ప్రీ వెడ్డింగ్ షూట్స్ చేస్తారా? అనే కాన్పెప్ట్ లు పరిచయం చేస్తున్నారు. అయితే ఇపుడు ఇంకో ట్రెండ్ రానే వచ్చింది. అసలు ఈ విషయాన్ని కూడా సెలబ్రేట్ చేసుకుంటారా అని షాక్ అవ్వకండి. ఆ ట్రెండ్ ఏంటో కాదు.. డివోర్స్ ఫోటో షూట్. అవును ఇప్పుడు విడాకులు తీసుకున్నా.. ఓ సెలబ్రేషన్. ఆనందంలో ఫొటో షూట్స్ ప్లాన్ చేసుకుంటున్నారు. పెళ్లి కార్డు కాల్చేస్తున్నారు. పెళ్లి బట్టలు తగలబెడుతున్నారు. అయితే ఈ మధ్య విదేశాల్లో ఈ ట్రెండ్ స్టార్ట్ అయింది.. ఇపుడు అది కాస్త పాకి మనదేశంలో కూడా మొదలుపెట్టారు. అసలు విడాకులు వెడ్డింగ్ షూట్ ఏంటీ? ఎక్కడ జరిగింది? ఎవరు తమ విడాకులను సెలబ్రేట్ చేసుకున్నారో చూడండి.
‘DIVORCE’ బోర్డుతో ఫోజులు(Divorce)
తమిళ సినీ రంగానికి చెందిన షాలిని ముల్లుమ్ అనే నటికి బుల్లితెరతో మంచి పేరు తెచ్చుకుంది. జీ తమిళ్ లో ప్రసారమయ్యే సూపర్ మామ్ రియాల్టీ షోలో కూడా ఆమె పాల్గొంది. ఆమెకు రియాజ్ అనే వ్యక్తితో వివాహం జరిగి.. ఒక కుమార్తె కూడా ఉంది. అయితే కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఆమె భర్తతో విడాకుల కోసం కోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలో ఆమెకు తాజాగా కోర్టు విడాకులు మంజారు చేసింది. దీంతో ఆమె తన ఆనందాన్ని ‘విడాకులు ఫొటో షూట్’తో సెలబ్రేట్ చేసుకోవడం విశేషం. మంచి డిజైనర్ దుస్తులు ధరించి.. చేతిలో ‘DIVORCE’ అనే బోర్డుతో ఫొటోలకు ఫోజులిచ్చింది షాలిని. అంతే కాకుండా తన భర్తతో ఉన్న ఫొటోను చింపి వేసింది. ‘ నాకు 99 ప్రాబ్లెమ్స్ ఉన్నాయి. కానీ భర్త ఒక్కటి కాదు’ అంటూ రాసున్న బోర్డును పట్టుకుని ఫొటోలు దిగారు. ఆ ఫొటోలను తన ఇన్ స్టా గ్రామ్ లో షాలిని పోస్ట్ చేసింది.
వారికి ఇదే నా సందేశం
తన ఇన్ స్టా లో ఫొటోలతో పాటు ఓ మెసేజ్ ను పెట్టింది. ‘ విడాకులు తీసుకున్న వారికి ఇదే నా సందేశం. విడాకులు తీసుకున్న మహిళలు గట్టిగా మాట్లాడలేరని అనుకుంటారు. కానీ ఇష్టం లేని వాళ్లతో వివాహబంధాన్ని విడిచిపెట్టడం సరైనదే. ఎందుకంటే ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండటానికి అర్హులు. మీ జీవితం మీ చేతుల్లోనే ఉంది. మీ పిల్లల భవిష్యత్ మీ చేతుల్లోనే ఉంది. వారికి మంచి భవిష్యత్ ఇవ్వడానికి ఇలాంటి వాటిని ఎదుర్కొవాల్సిందే. విడాకులు తీసుకుంటే ఫెయిల్ అయినట్టు కాదు. మీ లైఫ్ లో ఇదొక టర్నింగ్ పాయింట్. జీవితంలో సానుకూల మార్పులకు ఇది సంకేతం. ఒంటరిగా నిలబడాలంటే చాలా ధైర్యం కావాలి. అందుకే నాలా ఒంటరిగా ఉండే ధైర్యవంతులైన మహిళలందరికీ నేను దీన్ని అంకితం చేస్తున్నాను’ అని పోస్ట్ చేసింది. ఇపుడు ఫొటోలు, విడాకుల ఫొటో షూట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇది చూసిన నెటిజన్స్ కొందరు షాలినిని అభినందిస్తుండగా.. మరి కొందరు మాత్రం అవాక్కవుతున్నారు.
నెటిజన్స్ రెస్పాన్స్ ఎలా ఉందంటే..(Divorce)
షాలిని పెట్టిన విడాకులు ఫొటో షూట్ పై నెటిజన్స్ నుంచి భిన్నాభిప్రాయాలు వచ్చినా.. చాలామంది ఆమె ధైర్యాన్ని మెచ్చుకుంటున్నారు. మీరు‘సూపర్ ఉమెన్ ’అని , ‘మీరు చాలా ధైర్యవంతురాలు’అని మరొకరు కామెంట్స్ పెట్టారు. ‘మీరు జీవితంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారో ఇక్కడ ఎవ్వరికీ తెలియదు. తప్పుగా మాట్లాడే వారి గురించి పట్టించుకోకండి’ అంటూ మరికొందరు రిప్లై ఇచ్చారు. కాగా, గత నెలలో అమెరికాలోనూ ఓ యువతి భర్తతో విడిపోయిన సందర్భంగా తన విహాహ డ్రెస్ లను తగలబెట్టి మరీ వేడుక చేసుకుంది.