Bharat Jodo Yatra: గాంధీ అడుగుజాడల్లో నడవడం అధికారంలో ఉన్నవారికి కష్టం…

మహాత్మ గాంధీ జయంతి వేడుకల్లో అధికార భాజపాపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విరుచుకపడ్డారు. గాంధీ వారసత్వం అంటూ అధికారంలో ఉన్న వారు మాట్లాడుతారే కాని ఆయన అడుగుజాడల్లో నడవడం అధికారంలో ఉన్నవారికి కష్టంగా పేర్కొన్నారు

Rahul Gandhi: మహాత్మ గాంధీ జయంతి వేడుకల్లో అధికార భాజపాపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విరుచుకపడ్డారు. గాంధీ వారసత్వం అంటూ అధికారంలో ఉన్న వారు మాట్లాడుతారే కాని ఆయన అడుగుజాడల్లో నడవడం అధికారంలో ఉన్నవారికి కష్టంగా పేర్కొన్నారు. భారత జోడో యాత్ర లో భాగంగా 25వ రోజు రాహుల్ గాంధీ పాదయాత్ర కర్ణాటకలో సాగుతుంది. బదనవాలులోని ఖాదీ గ్రామోద్యోగ్ లోని జాతిపిత విగ్రహాన్ని పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.

ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ గత ఎనిమిది ఏళ్లలో దేశంలో అసమానత, కష్టపడి సాధించుకొన్న స్వాతంత్య్రం క్షీణించిందని పేర్కొన్నారు. హింస, అబద్దాల రాజకీయాల నడుమ అహింస, స్వరాజ్ సందేశాన్ని అందించేందుకే భారత జోడో యాత్రగా రాహుల్ పేర్కొన్నారు. మహాత్మా గాంధీ 1927లో సందర్శించిన బదనవాలు ఖాదీ గ్రామోద్యాగ కేంద్రంలో భారతదేశపు గొప్ప కుమారుడిని స్మరించుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. మరియు మా నివాళులు అర్పిస్తున్నాము. గాంధీజీ ఆంగ్లేయులతో పోరాడినట్లే, గాంధీని చంపిన భావజాలంతో నేడు యుద్ధానికి దిగుతున్నామన్నారు.

భారత్ జోడో యాత్ర కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు సాగుతూ రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రజలకు తెలియచేసేందుకు పెద్ద యుద్దమే చేస్తున్నారు.

ఇది కూడా చదవండి:Rahul Gandhi: తెలంగాణలో రాహుల్ గాంధీ పాదయాత్ర రూట్ మ్యాప్ రిలీజ్