Site icon Prime9

Mamata Banerjee: సింగర్ గా అవతారమెత్తిన ’దీదీ‘

Mamata Banerjee

Mamata Banerjee

Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గతంలో పెయింటింగ్, రచనలు, డ్యాన్స్ నుండి బ్యాడ్మింటన్ ఆడటం వరకు తన వివిధ నైపుణ్యాలను ప్రదర్శించారు. ఈసారి ఆమె గాయనిగా అవతారమెత్తి అందరినీ ఆశ్చర్యపరిచారు. మమత తన తాజా ఆల్బమ్ ‘ఉత్సాబర్ గాన్’ కోసం ఒక పాట పాడారు.

ఆదివారం, మహాలయ నాడు, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన తాజా ఆల్బమ్‌కు గాయనిగా అరంగేట్రం చేసిన దుర్గాపూజ ఉత్సవాన్ని జెండా ఊపి ప్రారంభించారు, ఇందులో ఆమె పాడడమే కాకుండా పాటలకు సాహిత్యం అందించడంతో పాటు సంగీతం కూడా అందించారు. ఈ ఆల్బమ్‌కు “ఉత్సాబెర్ గాన్” అని పేరు పెట్టారు మరియు ఇందులో ఎనిమిది పూజ-ప్రత్యేక పాటలను పూర్తిగా మమతా బెనర్జీ స్వరపరిచారు. టీఎంసీ మౌత్ పీస్ జాగో బంగ్లా ప్రకారం. సిఎం బెనర్జీ యొక్క ఈ ఆల్బమ్‌కు టిఎంసి నాయకులు బాబుల్ సుప్రియో, ఇంద్రనీల్ సేన్ మరియు చాలా మంది ఇతర గాయకులు తమ గాత్రాలను అందించారు.8 పాటల జాబితాలో, మమతా బెనర్జీ పాడిన ‘తక్ దుమ్దాదుమ్’ పాట అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఈ పాటను సిఎం బెనర్జీ ఈ పాటను ఇతర గాయకులు– ఇంద్రనీల్ సేన్ మరియు అదితి మున్షీతో కలిసి పాడారు.

పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ పలు దుర్గా పూజలను ప్రారంభించారుపూజల ప్రారంభోత్సవంలో ఉన్న సీఎం మమత కోల్‌కతాలో పలు దుర్గాపూజలను ప్రారంభించారు. ఆదివారం సెలింపూర్ పల్లి దుర్గాపూజ, బాబు బగన్ దుర్గాపూజ, 95పాలీ, జోధ్‌పూర్ పార్క్ దుర్గాపూజ, చెట్ల అగ్రనీ దుర్గాపూజలను మమతా బెనర్జీ ప్రారంభించారు.

 

Exit mobile version