Site icon Prime9

Dhoni LGM: ధోనీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై తొలి సినిమా.. టైటిల్ ఇదే

dhoni lgm

dhoni lgm

Dhoni LGM: అంతర్జాతీయ క్రికెట్లో ఎన్నో రికార్డులను సృష్టించాడు ధోని. అన్ని రంగాల్లో భారత్ కు ట్రోఫిలు అందించిన ఘనత ధోనికే చెందుతుంది. ఇలా క్రికెట్ లో రికార్డులు తిరగరాసిన ధోని.. ఎంటర్ టైన్ మెంట్ రంగంలోకి అడుగుపెట్టాడు. ధోనీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై తొలి చిత్రాన్ని ప్రకటించారు.

ధోని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై రూపొందుతున్న తొలి చిత్ర సినిమా టైటిల్ ను ప్రకటించారు. ‘లెట్స్ గెట్ మ్యారీడ్’ అని టైటిల్ తో సినిమా రూపొందిస్తున్నట్లు ప్రకటించారు. ఇందులో హీరో హీరోయిన్లను సైతం ప్రకటించారు. జెర్సీ సినిమాలో నటించిన హరీశ్ కళ్యాణ్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఇటివలే లవ్ టుడే సినిమాలో భారీ విజయాన్ని అందుకున్న ఇవానా ఇందులో హీరోయిన్ గా అవకాశం దక్కించుకుంది.

ఇక అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాక.. ధోని MS Dhoniవ్యవసాయంపై ఆసక్తి చూపించాడు.

తన సాగు చేసిన పంటను ధోని విదేశాలకు ఎగుమతి చేస్తున్నాడు.

వ్యవసాయంతో పాటు ధోని.. పాల వ్యాపారం, పౌల్ట్రిఫామ్ వ్యాపారం కూడా చేస్తున్నాడు.

కానీ ధోని భార్య సాక్షి సింగ్ కు మాత్రం సినిమాలంటే అమితమైన ఆసక్తి.

తన భార్యపై ఉన్న ఇష్టంతోనే ధోని ఈ రంగంలోకి దిగినట్లు తెలుస్తుంది.

అందుకే భార్య సలహా మేరకు ధోనీ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఓ ప్రొడక్షన్ హౌస్‌ని ప్రారంభించారు.

ఇది వరకే చెన్నై సూపర్ కింగ్స్ పై ఓ డాక్యుమెంటరిని సాక్షి రూపొందించారు.

ఇక ఈ సినిమాలో హరీశ్ కళ్యాణ్, ఇవానా లకు తోడుగా.. నదియా, యోగి బాబు ప్రధాన పాత్రల్లో నటించనున్నారు.

ఈ సినిమాకు తమిళ డైరెక్టర్ తమిళ్ మణి దర్శకత్వం వహించనున్నాడు.

మెుదట ఈ సినిమాలో ప్రియాంక మోహన్ ని హీరోయిన్‌గా ఎంచుకున్నారు. కానీ డేట్స్ సర్దుబాటు కాకపోవడంతో ఇవానాను ఎంపిక చేసినట్లు సమాచారం.
లవ్‌టుడే మూవీతో ఇవానా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఈ సినిమాకు ధోని భార్య నిర్మాతగా వ్యవహరించనుంది. ధోని ఈ సినిమాను సమర్పించనున్నాడు.

ఈ సినిమాను తెలుగులోకి డబ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. అదే జరిగితే తెలుగు రాష్ట్రాల్లో ధోని కి, ఇవానాకి చాలా మంది అభిమానులు ఉన్నారు.

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

Exit mobile version