Joshimath: ఉత్తరాఖండ్ జోషిమఠ్ పట్టణంలో ప్రమాదకరంగా ఉన్న ఇళ్లను, నివాస సముదాయాలను కూల్చడానికి అధికార యంత్రాంగం సిద్దమయింది. పలువురు నివాసితులను ప్రభుత్వం నిర్వహిస్తున్న శిబిరాలకు తరలించిన అధికారులు కూల్చివేతలకు సిద్దమయ్యారు. అయితే స్దానికుల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం కావడంతో తాత్కాలికంగా నిలిపివేసారు.
ఉత్తరాఖండ్ లో మలారి ఇన్ మరియు మౌంట్ వ్యూ అనే రెండు హోటళ్లతో పక్కన ఉన్న నివాసాలకు ముప్పు వాటిల్లితుందని భావించిన అధికారులు వాటిని కూల్చివేయడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. రాష్ట్రవిపత్తు దళం, సిబ్బంది అక్కడకు చేరగానే స్దానికులు నిరసన తెలిపారు. ఎటువంటి నష్టపరిహారం ప్రకటించకుండా కూల్చివేయడం తగదని వారు నినాదాలు చేసారు. మలారి ఇన్‌యజమాని ఠాకూర్ సింగ్ హోటల్ ముందు రోడ్డుపై పడుకుని నిరసన తెలిపాడు.
స్థానిక ప్రజలు మరియు హోటల్ యజమానుల నిరసనలతో అధికారులు కూల్చివేత కార్యకలాపాలను నిలిపివేశారు. భూమి కుంగడంతో జోషిమఠ్ లో 800 ఇళ్లు దెబ్బతిన్నాయి. 131 కుటుంబాలను తాత్కాలిక సహాయక కేంద్రాలకు తరలించారు. వీరికోసం 344 సహాయ శిబిరాలను ఏర్పాటు చేసారు. మరోవైపు ఈ ప్రాంతంలో 86 ఇళ్లను జిల్లాయంత్రాంగం ప్రమాదకరంగా గుర్తించింది. వీటిపై రెడ్ క్రాస్ మార్కులు వేసారు.
బాధితులకు ఆర్దికసాయం
జోషిమఠ్(Joshimath)లో బాధిత కుటుంబాలకు రూ.1,50,000 సాయాన్ని ముఖ్యమంత్రి ప్రకటించారు.
దీనితో పాటు ఇబ్బందులు పడుతున్న వారికి రూ.50 వేలు అదనంగా అందజేస్తామని అధికారులు తెలిపారు.
జోషిమఠ్‌లో తేలికపాటి వర్షాలు కురుస్తుండటంతో కొండచరియలు విరిగిపడతాయని స్దానికులు భయపడుతున్నారు.
వర్షాలు ఎక్కువగా కురిస్తే తమ పరిస్దితి మరింత అధ్వాన్నంగా ఉంటుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సుప్రీంకోర్టులో పిటిషన్
జోషిమఠ్‌లో ఏర్పడిన సంక్షోభాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించేందుకు జోక్యం చేసుకోవాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను జనవరి 16న విచారిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది.అత్యవసర విచారణను తిరస్కరించిన కోర్టు, దీనికోసం ప్రజాస్వామ్యంగా ఎన్నికైన సంస్థలు’ ఉన్నాయని, అన్ని విషయాలు తన వద్దకు రాకూడదని పేర్కొంది.
ఇవి కూడా చదవండి
Ram Charan: రామ్‌చరణ్ మెగా రివీల్: నెక్ట్స్ మార్వెల్ హీరో.. ఐరన్ మ్యాన్ vs కెప్టెన్ అమెరికా.. నేను నటించే సూపర్ హీరో క్యారెక్టర్ ఏంటంటే..
Ram Charan: రామ్‌చరణ్ గోల్డెన్ గ్లోబ్ ఇంటర్వ్యూ: ఏం యాక్సెంట్‌రా బాబూ.. మెగా పవర్‌స్టార్ అదరగొట్టేశాడు..
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/@Prime9News
https://www.youtube.com/Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: http://Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/