Site icon Prime9

Delhi municipal election: డిసెంబర్ 4న ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలు.. ప్రకటించిన ఎన్నికల కమిషన్

Delhi Municipal Corporation Elections on December 4

Delhi: డిసెంబర్ 4న ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహించనున్నట్లు స్టేట్ ఎలక్షన్ కమీషనర్ విజయ్ దేవ్ ప్రకటించారు. డిసెంబర్ 7న ఓట్ల లెక్కింపు జరుగుతుందన్నారు. ఈ మేరకు షెడ్యూల్ ను తెలిపారు. ఈ నెల 7న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తారు. 14న నామినేషన్ల తంతు ముగించనున్నారు. అభ్యర్ధుల నామినేషన్ల ఉపసంహరణ 19వతేదీగా నిర్ణయించారు. ఈ నేపథ్యంలో నేటి నుండి ఢిల్లీలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని విజయ్ దేవ్ పేర్కొన్నారు.

ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ లోని 68 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 250 వార్డులకు ఎన్నికలు జరుగుతాయని, అందులో 42 వార్డులు ఎస్సీ రిజర్వ్‌డ్‌ స్థానాలు ఉన్నట్లు ఎన్నికల అధికారులు పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: CM Arvind Kejriwal: కాలుష్యం ఎఫెక్ట్.. ఢిల్లీలో ప్రైమరీ స్కూళ్ళ మూసివేత: సీఎం కెజ్రీవాల్

Exit mobile version