Site icon Prime9

Manish Sisodia: బీజేపీలో చేరితే సీబీఐ, ఈడీ కేసులు ఎత్తివేస్తామన్నారు.. మనీష్ సిసోడియా

Delhi: తాను బీజేపీలో చేరితే తనపై ఉన్న సీబీఐ, ఈడీ కేసులను ఎత్తేస్తామని బీజేపీ నుంచి తనకు సందేశం వచ్చిందని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా చెప్పారు. అయితే బీజేపీలో చేరడం కంటే తన తల నరుక్కుంటానని ఆయన అన్నారు.

మనీష్ సిసోడియా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌తో కలిసి గుజరాత్‌లో ఎన్నికల ప్రచారానికి వెళ్లారు. ప్రజలు కేజ్రీవాల్‌కు అవకాశం ఇవ్వాలని, ఢిల్లీ, పంజాబ్‌లలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ప్రత్యేకించి ఆరోగ్యం, విద్యారంగంలో చేస్తున్న కృషిని ప్రతి ఒక్కరూ చూడగలరని మనీష్ సిసోడియా అన్నారు. గుజరాత్ లో గత 27 ఏళ్లలో బీజేపీ చేసిందేమీ లేదని ఆయన అన్నారు. గుజరాత్‌లో ఆరోగ్యం మరియు విద్య మౌలిక సదుపాయాల దారుణంగా ఉందని అన్నారు.

మరోవైపు తనతో ఉన్న డిప్యూటీ మనీష్ సిసోడియాను ప్రశంసిస్తూ కేజ్రీవాల్ ప్రపంచంలోనే అత్యుత్తమ విద్యాశాఖ మంత్రి ఈరోజు మనతో ఉన్నారు. ఆయన చిత్రాన్ని న్యూయార్క్ టైమ్స్‌లో ప్రచురించిన విద్యాశాఖ మంత్రి అని అన్నారు.

Exit mobile version