Site icon Prime9

బీహార్‌: కల్తీ మద్యం కేసులో 60కు చేరిన మృతుల సంఖ్య.. ఒక్కరూపాయి పరిహారం ఇవ్వనంటున్న సీఎం..?

Bihar

Bihar

Bihar Liquor Case: బీహార్‌లోని సరన్ జిల్లాలో కల్తీ మద్యం సేవించడం వల్ల మరణించిన వారి సంఖ్య 60కి చేరుకుంది. ఛప్రాలోని హూచ్ విషాదం నేపథ్యంలో, మర్హౌరా సబ్-డివిజనల్ పోలీస్ ఆఫీసర్ యోగేంద్ర కుమార్ సిఫార్సు మేరకు స్టేషన్ హౌస్ ఆఫీసర్ రితేష్ మిశ్రా మరియు కానిస్టేబుల్ వికేష్ తివారీలను గురువారం సస్పెండ్ చేశారు. మరోవైపు ఈ కల్తీమద్యంకేసు బీజేపీ ప్రభుత్వంపై విరుచుకుపడటానికి అందివచ్చినట్లయిందని భావిస్తున్నారు.

బీహార్ అసెంబ్లీలో ‘షరాబీ’ వ్యాఖ్యలపై బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ క్షమాపణలు చెప్పాలని భారతీయ జనతా పార్టీ ఎంపీ సుశీల్ మోదీ గురువారం డిమాండ్ చేశారు. అసెంబ్లీలో కుమార్ తన ప్రకటనకు క్షమాపణ చెప్పాలని మోదీ అన్నారు.గత ఆరేళ్లలో బీహార్‌లో కల్తీ మద్యం కారణంగా 1,000 మందికి పైగా మరణించారు.అసెంబ్లీలో నితీష్ కుమార్ ప్రవర్తించిన తీరు సరిగా లేదు, క్షమాపణ చెప్పాలి. ఈ ఘటనలో మరణించిన వారికి ఎటువంటి పోస్ట్‌మార్టం లేకుండానే “శవాలను కాల్చడం” ద్వారా రాష్ట్ర ప్రభుత్వం దాస్తోందని బీహార్ ప్రతిపక్ష నాయకుడు విజయ్ కుమార్ సిన్హా ఆరోపించారు. సీఎం నితీష్ కుమార్ పూర్తి బాధ్యత వహించి రాజీనామా చేయాలని సిన్హా డిమాండ్ చేసారు. బీహార్ లో మద్యనిషేధం ఉన్నందున మద్యంతాగి చనిపోయిన వారికి పరిహారం చెల్లించే ప్రసక్తి లేదని సీఎం నితీష్ కమార్ స్పష్టం చేసారు.

కల్తీమద్యం దుర్ఘటనపై సిట్ విచారణ జరిపించాలని కోరుతూ శుక్రవారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. అక్రమ మద్యం తయారీ, వ్యాపారం మరియు అమ్మకాలను అరికట్టడానికి స్వతంత్ర దర్యాప్తు మరియు కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని పిటిషనర్ కోరారు. విషాదంలో ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని కూడ విజ్జప్తి చేసారు. రాష్ట్రంలో ఇప్పటికే 31 మంది పోలీసు అధికారులతో కూడిన సిట్‌ను ఏర్పాటు చేశారు, దీనికి ఒక అదనపు ఎస్పీ, ముగ్గురు డిప్యూటీ ఎస్పీలు నేతృత్వం వహిస్తున్నారు.

ఇదీ చదవండి: పక్క రాష్ట్రాల్లో పుట్టినా బాగుండేదని ఏపీ ప్రజలు అనుకుంటున్నారు… స్వార్థం కోసం ప్రభుత్వం ఇచ్చే పథకాలపై ఆధారపడొద్దు

 

Exit mobile version