Gujarat: గుజరాత్ లో ఎన్నికల నగారా మోగగానే ప్రధాన పార్టీలు తమ తమ ప్రచారాన్ని ఉధృతం చేశాయి. గత కొద్ది రోజులుగా గుజరాత్ లో సుడిగాలి పర్యటనలతో ప్రజలను ఆప్ పార్టీ వైపు తిప్పుకొనేందుకు అధినేత కేజ్రీవాల్ విభన్న ప్రకటనలు గుప్పిస్తున్నారు. వారిలో ఆలోచనలు రేకెత్తిస్తున్నారు.
తాజాగా గుజరాత్ ప్రజలకు తానో ప్రియమైన సందేశం ఇస్తున్నానంటూ ట్విటర్ లో వీడియో విడుదల చేశారు. నేను మీ సోదరుడిని, మీ కుటుంబసభ్యుల్లో ఒకరిని. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. నేను మీకు ఉచిత విద్యుత్ ఇస్తాను. పాఠశాలల నిర్మిస్తాను. వైద్యశాలలు కట్టిస్తానంటూ వ్యాఖ్యానించారు. మరోవైపు హిందూ ఓటర్లను ఆకర్షించేలా ప్రజలను అయోధ్య రామమందిరం వద్దకు తీసుకెళ్తానని అన్నారు.
గుజరాత్ ప్రజలు భారీ మార్పును కోరుకుంటున్నారని ఆప్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇప్పటివరకు ఉన్న సమాచారం మేరకు 90సీట్లలో విజయం సాధిస్తామన్న ధీమా వుందంటున్నారు. ఇదే విధంగా సాగితే 140సీట్లలో విజయం సాధించే అవకాశాలను చెప్పుకొస్తున్నారు. ఇటీవల జరిగిన మోర్బీ వంతెన నిర్మాణంలో చోటుచేసుకొన్న అవినీతిని ఓ అస్త్రంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఆప్ శ్రేణులు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. 2017 ఎన్నికల్లో గుజరాత్ లో 30 సీట్లలో ఆప్ పోటీ చేసింది. అయితే ప్రజలు పెద్దగా స్పందించలేదు. అయితే పంజాబ్ లో సాధించిన విజయంతో గుజరాత్ లో పూర్తి స్థాయిలో 182 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆప్ పార్టీ తన అభ్యర్ధులను నిలబెడుతుంది.
ఇది కూడా చదవండి: Gujarat Assembly Elections: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల
गुजरात के लोगों को मेरा प्यार भरा संदेश … pic.twitter.com/gaod6GZpho
— Arvind Kejriwal (@ArvindKejriwal) November 3, 2022