Site icon Prime9

Central government: ట్విట్టర్‌లో ఉద్యోగుల కోత సరికాదు.. కేంద్ర ప్రభుత్వం

Cut of employees in Twitter is not correct..Central Govt

New Delhi: ట్విటర్ అధినేత ఎలన్ మస్క్ తీసుకొంటున్న విధానాల పై ప్రపంచవ్యాప్తంగా నిత్యం ఏదో ఒక చోట విమర్శలు తలెత్తున్నాయి. ప్రధానంగా ఉద్యోగులను తొలగించడం అంతర్జాతీయంగా పెను సంచలన సృష్టించింది. తాజాగా ఉద్యోగుల కోతను భారతదేశ ఐటి మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఖండించారు. ట్విటర్ లో పనిచేస్తున్న ఉద్యోగులకు తగిన సమయం ఇచ్చివుండాల్సిందని పేర్కొన్నారు. భారత్‌లో ట్విట్టర్‌ తమ ఉద్యోగుల్ని తొలగించడాన్ని మేం ఖండిస్తున్నాం అని ఆయన అన్నారు. మన దేశంలో ట్విటర్ లో పనిచేస్తున్న ఉద్యోగుల 200కి పైగా ఉన్నట్లు సమాచారం. మెజారిటీ ఉద్యోగులకు ఎలన్ మస్క్ ఉధ్వాసన పలికారు.

అయితే ఎలన్ మస్క్ మాత్రం ఈ వ్యవహారంలో ట్విటర్ సంస్ధకు భారం కాకూడదన్న ఆలోచనలోనే ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని తెలిపారు. తొలుత పలువురు కీలక ఉద్యోగులను తొలగించారు. అనంతరం 50శాతానికి పైగా ఉద్యోగుల తొలగిస్తూ మెయిల్స్ పంపించారు. ఉద్యోగాల కోత ప్రక్రియ పూర్తయ్యేంతవరకు ట్విటర్ ఆఫీసులను మూసివేస్తున్నట్లు ఎలన్ మస్క్ ప్రకటించారు.

ఇది కూడా చదవండి: Jack Dorsey: ఉద్యోగులకు సారీ.. ట్విటర్ ఫౌండర్ జాక్ డార్సీ

Exit mobile version
Skip to toolbar