Site icon Prime9

Corona Cases: దేశంలో కరోనా విజృంభణ.. భారీగా పెరుగుతున్న కేసులు

corona XXB variant in Maharashtra

corona XXB variant in Maharashtra

Corona Cases: దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ కేసుల తీవ్రత దిల్లీ, కేరళలో అధికంగా ఉంది. దీంతో ప్రభుత్వం భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనా నిర్దారణ పరీక్షలను పెంచాలని.. ఆస్పత్రుల్లో బెడ్లు, ఐసీయూ సంఖ్యలను పెంచాలని చూస్తోంది.

పెరుగుతున్న కరోనా కేసులు.. (Corona Cases)

దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ కేసుల తీవ్రత దిల్లీ, కేరళలో అధికంగా ఉంది. దీంతో ప్రభుత్వం భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనా నిర్దారణ పరీక్షలను పెంచాలని.. ఆస్పత్రుల్లో బెడ్లు, ఐసీయూ సంఖ్యలను పెంచాలని చూస్తోంది.

కరోనా తర్వాత పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకున్నాయి. అయితే దేశంలో కరోనా కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతుంది. ముఖ్యంగా దిల్లీ, కేరళలో ఈ కేసుల సంఖ్య అధికంగా ఉంది.

కేరళలో ఒక్కరోజే.. వెయికి పైగా కేసులు నమోదయ్యాయి. ఒక్కసారిగా అధిక కేసులు నమోదు కావడంతో.. కేరళ ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్ అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు.

కరోనా కేసులు ఎక్కువైతే తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.

దిల్లీలో కొత్తగా 535 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం దేశంలో కరోనా పాజిటివిటీ రేటు 23.05 శాతానికి పెరిగింది.

జ్వరం, దగ్గు, ఒంటి నొప్పులు తదితర లక్షణాలు ఉంటే తప్పనిసరిగా కరోనా పరీక్షలు చేయించుకోవాలని అధికారులు సూచించారు.

కేసుల పెరుగుదలకు కొత్త వేరియంట్ XBB.1.16 వేరియంట్ కారణమని అనుమానిస్తున్నారు.

వేరియంట్ తో భయపడాల్సిన అవసరం లేదని, ప్రజలు బూస్టర్ డోస్ తీసుకోవడంతో నిబంధనలు పాటిస్తే సరిపోతుందని తెలిపారు.

కాగా, ఇన్ ఫ్లూయెంజా సబ్ టైప్ హెచ్3ఎన్2 కారణంగా ఇన్ ఫ్లూయెంజా కేసుల సంఖ్య పెరగడానికి కారణమని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వెల్లడించింది.

H3N2 వైరస్ సోకితే ముక్కు కారడం, నిరంతర దగ్గు మరియు జ్వరం లక్షణాలు కనిపిస్తున్నాయని తెలిపింది.

ఇన్ ఫ్లుయెంజా కారణంగా ఆస్పత్రుల్లో చేరే వారి సంఖ్య పెరుగుతోందని పేర్కొంది.

మాస్క్ లు తప్పనిసరి..

కరోనా నాలుగో వేవ్ పై కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. మరోసారి ఆంక్షలు విధించే దిశగా ఆయ రాష్ట్రాలు చూస్తున్నాయి.

మాస్క్ తప్పనిసరిగా వాడాలని రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేస్తున్నాయి. ఇదివరకే.. హర్యానా, కేరళ, పుదుచ్చేరిలో బహిరంగ ప్రదేశాల్లో మాస్కులను తప్పనిసరి చేసింది.

 

Exit mobile version