BRS office: దిల్లీలో నూతనంగా నిర్మించిన భారత రాష్ట్ర సమితి కేంద్ర కార్యాలయాన్ని ఆ పార్టీ అధినేత.. సీఎం కేసీఆర్ కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఘనంగా ప్రారంభించారు. ముందుగా నిర్ణయించిన ముహూర్తం ప్రకారం.. 1గం.05నిమిషాలకు రిబ్బన్ కట్ చేసి కార్యాలయాన్ని ప్రారంభించారు.
ఘనంగా ప్రారంభం..
దిల్లీలో నూతనంగా నిర్మించిన భారత రాష్ట్ర సమితి కేంద్ర కార్యాలయాన్ని ఆ పార్టీ అధినేత.. సీఎం కేసీఆర్ కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఘనంగా ప్రారంభించారు. ముందుగా నిర్ణయించిన ముహూర్తం ప్రకారం.. 1గం.05నిమిషాలకు రిబ్బన్ కట్ చేసి కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. దీంతో వసంత్ విహార్ ప్రాంతంలో సందడి నెలకొంది. ఆఫీస్ ప్రారంభించిన అనంతరం.. మంత్రులు, ఎమ్మెల్యేలతో కేసీఆర్ భేటీ అయ్యారు.
ఈ భవనాన్ని మెుత్తం ఐదు అంతస్థుల్లో నిర్మించారు. మొత్తం 1,300 గజాల్లో ఉన్న స్థలంలో 20 వేల చదరపు అడుగుల ప్రాంతంలో భవనాన్ని నిర్మించారు. గ్రౌండ్ ఫ్లోర్లో మీడియా సమావేశాలను నిర్వహించేందుకు మరో రెండు ఇతర గదులను నిర్మించారు.
సమావేశాల అనంతరం.. మీడియా, కార్యకర్త లు, నాయకుల కోసం క్యాంటీన్ ను ఏర్పాటు చేశారు. 2,3 అంతస్తుల్లో దిల్లీలో పార్టీకి సంబంధించిన కార్యక్రమాలకు వచ్చే కార్యకర్తలు, నాయకులు బస చేసేందు కు 18 గదులతోపాటు రెండు ప్రత్యేక సూట్ రూమ్‌లను సిద్ధం చేశారు. సూట్ రూమ్‌లలో పార్టీ అధ్యక్షుడు, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు బస చేస్తారు.