Site icon Prime9

Cleaning toilets with students: విద్యార్జలతో మరుగుదొడ్లు క్లీనింగ్. యిపిలో ఘటన

Cleaning toilets with students

Cleaning toilets with students

Uttara Pradesh: బుల్ డోజర్ ప్రభుత్వంగా దేశ వ్యాప్తంగా సంచలన ప్రాంతంగా గుర్తింపు పొందిన ఉత్తర ప్రదేశ్ లో దారుణం చోటుచేసుకొనింది. పసిపిల్లలైన విద్యార్ధులతో మరుగుదొడ్లు శుభ్రం చేయించారు. యోగి ఆధిత్యానాధ్ ప్రభుత్వంలో చోటుచేసుకొన్న ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ మారింది…వివరాల్లోకి వెళ్లితే…

బల్లియా జిల్లా సోహవాన్ లోని పిప్రా కాలా వద్ద ఉన్న ప్రాధమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు విద్యార్ధులతో మరుగుదొడ్ల శుభ్రం చేయించాడు. పాఠశాల ప్రిన్సిపాల్ సూచనమేరకు ఇద్దరు బాలురు చేత మగ్గు, బ్రష్, టాయిలెట్ క్లీనర్ తో శుభ్రం చేస్తుండడాన్ని చాటుగా వీడియో తీసారు. మరుగుదొడ్డి కడగక పోతే తాళం వేస్తానని బెదిరించడంతో విద్యార్ధులు గత్యంతరం లేక శుభ్రం చేసిన్నట్లు తెలుస్తుంది.

ఆ వీడియోను చూసిన బల్లియా జిల్లా ప్రాధమిక విద్యాధికారి ఘటనపై విచారణకు ఆదేశించారు. నివేదిక వచ్చిన అనంతరం చర్యుల తీసుకొనే అవకాశాలు ఉన్నాయంటూ స్ధానికులతో పేర్కొన్నాడు. అక్షరాలు దిద్దాల్సిన చేతులతో పారిశుధ్య పనులు చేయించడాన్ని పలువరు ఖండించారు. అయితే వ్యవహారంపై సిఎం పేషీ నుండి ఎలాంటి స్పందన లేకపోవడంతో ప్రజలు ఔరా అని ముక్కున వేలేసుకొన్నారు.

Exit mobile version