Site icon Prime9

Operation Meghchakra: చైల్డ్‌ ఫోర్నోగ్రఫీ పై సీబీఐ దాడులు

CBI

CBI

New Delhi: కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ చైల్డ్‌ ఫోర్నోగ్రఫీ పై కొరఢా ఝళిపించింది. దేశవ్యాప్తంగా 19 రాష్ట్రాలు, 56 లోకేషన్లలో ఏక కాలంలో దాడులు జరిపింది. పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఆన్‌లైన్‌ చైల్డ్‌ ఫోర్నోగ్రఫీ కేసులు వెలుగు చూడ్డంతో సీబీఐ ఆపరేషన్‌ మెగాచక్రకు శ్రీకారం చుట్టినట్లు అధికారులు తెలిపారు.

ఇదిలా ఉండగా సింగపూర్‌ ఇంటెలిజెన్స్‌ అధికారుల నుంచి సమాచారం అందడంతో ఆపరేషన్‌ మెగాచక్రను ప్రారంభించింది సీబీఐ. గత ఏడాది కూడా ఇలాంటి ఆపరేషన్‌ ను కార్బన్‌ పేరుతో నిర్వహించింది. చైల్డ్‌ ఫోర్నోగ్రఫీని ఇంటర్నేట్‌ క్లౌడ్‌ స్టోరేజీ ద్వారా సర్క్యూలేట్‌ చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. క్లౌడ్‌ స్టోరేజీ ద్వారా చైల్డ్‌ ఫోర్నోగ్రఫీ సర్క్యూలేట్‌ చేసే వారినే లక్ష్యంగా చేసుకొని దాడులు నిర్వహిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

ఇంటర్‌పోల్‌కు సీబీఐ నోడల్ ఏజెన్సీ కూడా, ఇది అంతర్జాతీయ బాలల లైంగిక వేధింపుల చిత్రం మరియు వీడియో డేటాబేస్‌ను కలిగి ఉంది, ఇది సభ్య దేశాల పరిశోధకులను పిల్లల లైంగిక వేధింపుల కేసులపై డేటాను పంచుకోవడానికి అనుమతిస్తుంది.ఈ డేటాబేస్‌లో ఉన్న 2.3 మిలియన్ చిత్రాలు మరియు వీడియోల నుండి ప్రపంచవ్యాప్తంగా 23,500 మంది ప్రాణాలు మరియు 10,752 మంది నేరస్థులను గుర్తించడంలో సహాయపడింది. ఇది అన్ని దేశాలు మరియు నిర్దిష్ట దేశాలతో యాక్సెస్ చేయగల ఓపెన్ నెట్‌వర్క్‌లో డేటాను పంచుకునే సదుపాయాన్ని కలిగి ఉంది.పిల్లల అశ్లీల ప్రసారానికి సంబంధించిన కేసులను పర్యవేక్షించడానికి ఉన్న యంత్రాంగంపై వివరణాత్మక నివేదికను సమర్పించాలని గత వారం సుప్రీంకోర్టు కేంద్రాన్ని కోరిన తర్వాత ఈ దాడులు జరిగాయి.

Exit mobile version