Satya Pal Malik: జమ్ము కశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ కు సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు ఏప్రిల్ 28వ తేదీన విచారణకు హాజరు కావాలని కోరింది. సత్యపాల్ మాలిక్ కు నోటీసులు జారీ చేయడం పట్ల ప్రతిపక్షాలు స్పందించాయి. కుట్రపూరితంగానే నోటీసులు అందించారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
సీబీఐ నోటీసులు.. (Satya Pal Malik)
జమ్ము కశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ కు సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు ఏప్రిల్ 28వ తేదీన విచారణకు హాజరు కావాలని కోరింది. సత్యపాల్ మాలిక్ కు నోటీసులు జారీ చేయడం పట్ల ప్రతిపక్షాలు స్పందించాయి. కుట్రపూరితంగానే నోటీసులు అందించారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్‌పై అవినీతి ఆరోపణల విషయంలో ఈ నోటీసులు జారీ చేసింది. 2018లో కంపెనీ కాంట్రాక్ట్ సమయంలో జమ్ము కశ్మీర్ గవర్నర్‌గా సత్యపాల్ మాలిక్ ఉన్నారు. ఈ కాంట్రాక్ట్ పనులను.. స్వయంగా సత్యపాల్ మాలిక్ పర్యవేక్షించి ఒప్పందాన్ని రద్దు చేశారు.
జమ్ము కశ్మీర్ లో ప్రభుత్వ ఉద్యోగులు, వాళ్ల కుటుంబసభ్యుల మెడికల్ ఇన్సూరెన్స్ కు సంబంధించిన స్కాం ఇంది. ఇందులో దాదాపు మూడున్నర లక్షల మంది ఉద్యోగులు 2018 సెప్టెంబర్‌లో ఇందులో చేరారు. ఈ కాంట్రాక్ట్ లో భారీగా అవకతవకలు ఉన్నాయని.. అప్పటి గవర్నర్ దీనిని రద్దు చేశారు.
ఈ కేసుకు సంబంధించిన ఎఫ్‌ఐఆర్‌లో రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్‌తో పాటు ట్రినిటీ రీఇన్సూరెన్స్ బ్రోకర్స్‌ను నిందితులుగా చేర్చింది సీబీఐ.
ఇందులో మోసం జరిగిందని మాలిక్ ఆరోపించడంతో.. ఆయన నుంచి అదనపు సమాచారం సేకరించేందుకే సీబీఐ ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది.
దీంతో పాటు.. మరో కేసులో సీబీఐ నోటీసులు అందించింది. జమ్ము కశ్మీర్ దాదాపు రూ.2,200 కోట్ల వ్యయంతో చేపట్టిన కిరూ హైడ్రాలిక్ పవర్ ప్రాజెక్టుకు సంబంధించిన ఆరోపణలు.
ఈ కాంట్రాక్ట్ ను ముందుకు తీసుకువెళ్లాలని.. బీజేపీ నేత రామ్ మాధవ్ అప్పట్లో అనుకున్నారని సత్యపాల్ మాలిక్ ఓ ఇంటర్వూలో తెలిపారు.
సంచలన వ్యాఖ్యలు..
కరణ్ థాపర్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సత్యపాల్ మాలిక్ సంచలన ఆరోపణలు చేశారు. పుల్వామా దాడి ఘటనపై చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం లేపాయి.
అవినీతిపై మోదీ ఎలాంటి చర్యలు తీసుకోరని, ఎందుకంటే అందులో ఆరోపణలు ఎదుర్కొనేవాళ్లు ఆయనకు సన్నిహితులేనని వ్యాఖ్యానించారు.
పుల్వామా దాడి సమయంలో మోదీ, అజిత్ దోవల్ తనకు చేసిన సూచనలపైనా ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం పుట్టించాయి.
పుల్వామా దాడిలో ఇంటెలిజెన్స్ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు.
300 కేజీల ఆర్డీఎక్స్ పాక్ నుంచి రావడం, జమ్ము కశ్మీర్‌లో పది నుంచి పదిహేను రోజులపాటు చక్కర్లు కొట్టడం, దానిని అధికారులు గుర్తించలేకపోవడం పైనా మాలిక్ వ్యాఖ్యలు చేశారు.