Site icon Prime9

Bullet Train: 2026 నాటికి అందుబాటులో బుల్లెట్ రైలు.. అశ్విని వైష్ణవ్

Bullet Train

Bullet Train

Bullet Train: భారతదేశపు మొట్టమొదటి బుల్లెట్ రైలు మొదటి సర్వీసును 2026లో నడిపే అవకాశం ఉందని కేంద్ర రైల్వే మరియు ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ మంగళవారం తెలిపారు. ఒక వార్తాసంస్దకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్టాడుతూ అహ్మదాబాద్-ముంబై మార్గంలో బుల్లెట్ రైళ్ల పనులు చాలా బాగా జరుగుతున్నాయని చెప్పారు.

ఉద్ధవ్ థాకరే ప్రభుత్వ వైఖరితో..(Bullet Train)

ఇప్పటికే 290 కిలోమీటర్లకు పైగా పనులు పూర్తయ్యాయి. ఎనిమిది నదులపై వంతెనలు నిర్మించారు. 12 స్టేషన్లలో పనులు కొనసాగుతున్నాయి. పనులు పూర్తయ్యే దశకు చేరుకున్నాయని అశ్విని వైష్ణవ్ తెలియజేశారు. రెండు డిపోల్లో పనులు కొనసాగుతున్నాయి. 2026లో మొదటి విభాగాన్ని ప్రారంభించాలనే పూర్తి లక్ష్యంతో పనులు చాలా వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. బుల్లెట్ రైలు వేగానికి వచ్చే ప్రకంపనలు బలంగా ఉంటాయి . కాబట్టి దీని రూపకల్పన చాలా క్లిష్టంగా ఉంటుందని ఆయన తెలిపారు. కోవిడ్ మహమ్మారి కారణంగా మధ్యలో పనులకు అంతరాయం కలిగిందన్నారు. మహారాష్ట్రలో ఉద్ధవ్ థాకరే ప్రభుత్వం అనుమతి ఇవ్వడానికి నిరాకరించిందని దీనివలన ప్రాజెక్ట్ ఆలస్యం అయిందన్నారు. బుల్లెట్ రైలు ప్రాజెక్టు పని 2017లో ప్రారంభమయింది. దీని డిజైన్ పూర్తి చేయడానికి సుమారుగా రెండున్నర సంవత్సరాలు పట్టింది.

Exit mobile version