Site icon Prime9

Parliament sessions: జనవరి 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు

Parliament

Parliament

Parliament sessions: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల షెడ్యూల్ ఖరారైంది. జనవరి 31 నుంచి ప్రారంభమై ఏప్రిల్ 6 వరకు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరుగనున్నట్టు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషి ట్విట్టర్లో వెల్లడించారు. రెండు విడతల్లో జరిగే ఈ సమావేశాలు ఏప్రిల్ 6 న ముగుస్తాయి. 66 రోజుల వ్యవధిలో మొత్తం 27 రోజల పని దినాల్లో ఈ బడ్జెట్ సమావేశాలు జరుగుతాయి. తొలి విడత సమావేశాలు జనవరి 31 వ తేదీ నుంచి ఫిబ్రవరి 14 తేదీ వరకు జరుగనున్నాయి. ఫిబ్రవరి 14వ తేదీ నుంచి మార్చి 12 వతేదీ వరకు తాత్కాలిక విరామం ఉంటుంది. రెండో విడతలో మార్చి 13న ప్రారంభమై ఏప్రిల్ 6 సమావేశాలు ముగుస్తాయి.

తొలిసారి రాష్ట్రపతి ప్రసంగం

పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో రాజ్యసభ, లోక్ సభ సంయుక్త సమావేశంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంతో బడ్జెట్ సమావేశాలు(Parliament sessions) ప్రారంభమవుతాయి. తొలిసారి పార్లమెంట్ ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగం ఉంటుంది. కేంద్ర బడ్జెట్, రాష్ట్రపతి ప్రసంగం, ఇతర అంశాలపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చల కోసం ఎదురుచూస్తున్నట్టు కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు.

 ఫిబ్రవరి 1 బడ్జెట్

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి ఒకటిన కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.

ఈ సారి బడ్జెట్ లో ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో చూడాలి.

మరో వైపు నిత్యవసరాల ధరలు, నిరుద్యోగం వంటి అంశాలను హైలెట్ చేసేందుకు కాంగ్రెస్ తో పాటు ఇతర ప్రతిపక్ష పార్టీలు సిద్దమవుతున్నాయి.

మరి ఈ కొత్త ఏడాదిలో ఏఏ రాష్ట్రాలకు ఎంతెంత బడ్జెట్ ఇవ్వనున్నారు అనేది ఏఏ పథకాలకు పెద్దపీట వెయ్యనున్నారు అనేది తెలియాల్సి ఉంది. నిర్మలమ్మ పద్దు కోసం యావత్ దేశ ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

 

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

Exit mobile version