Air India Flight న్యూఢిల్లీ విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు ఈ – మెయిల్ రావడంతో పెద్ద కలకలం ఏర్పడింది. విమానంలోని లావెట్రీలో ఓ టిష్యూ పేపరుపై విమానంలో బాంబు పెట్టినట్లు రాసి ఉన్న పేపర్ లభించింది. దీంతో సెక్యూరిటీ ఏజెన్సీలు రంగంలోకి దిగి విమానం మొత్తం గాలించాయి. చిట్ట చివరకు ఇది ఉత్తుత్తి బాంబు బెదిరింపు అని తేలిపోయిందని పోలీలు ఉన్నతాధికారులు తెలిపారు.
దీనిపై పోలీసులు ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. బుధవారం నాడు ఉదయం 7.30 గంటలకు ఎయిర్ ఇండియా విమానం న్యూఢిల్లీ నుంచి వడోదరా వెళ్లాల్సి ఉంది. అయితే విమానం లెవెట్రీ టిష్యూ పేపర్‌పై విమానంలో బాంబు పెట్టినట్లు రాసి ఉందని పోలీసులు తెలిపారు. కాగా స్టాండర్డ్ సెక్యూరిటీ ప్రోటోకాల్స్ ప్రకారం విమానం మొత్తం గాలింపు జరిపామని.. చివరకు ఎలాంటి అనుమానిత వస్తువు కనిపించలేదని డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీసు ఐజీఐ ఎయిర్‌పోర్ట్ ఉషా రంగ్‌నాని తెలిపారు.
ఇదిలా ఉండగా ఇటీవల కాలంలో ఢిల్లీలో స్కూళ్లకుకూడా బాంబు బెదిరింపు కాల్స్ వచ్చిన విషయం తెలిసిందే. సుమారు వంద స్కూళ్లకు ఇలాంటి బాంబు బెదిరింపు ఈ మెయిల్స్ వచ్చిన విషయం తెలిసిందే. అటు తర్వాత ఢిల్లీలోని పలు ఆస్పత్రులకు ఇలాంటి బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో పాటు ఆదివారం నాడు ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి కూడా బాంబు బెదిరింపు ఈ మెయిల్స్ వచ్చాయి. విమానాశ్రయం పరిసరాల్లో బాంబులు పెట్టామని ఈ మెయిల్స్ వచ్చాయి. అటు తర్వాత పోలీసులు దీనిపై దర్యాప్తు చేస్తే ఇవన్నీ ఉత్తుత్తి బెదిరింపు మెయిల్స్ అని తేలిపోయింది. పక్షం రోజుల క్రితం ఢిల్లీ – ఎన్‌సీఆర్‌లలో సుమారు 150 కంటే ఎక్కువ స్కూళ్లకు బెదిరింపు ఈ – మెయిల్స్ వచ్చిన విషయం తెలిసిందే. ఇక న్యూఢిల్లీ స్కూళ్లకు వచ్చిన ఈ మెయిల్ బాంబు బెదిరింపు విషయానికి వస్తే ఇవి పాకిస్తాన్ నుంచి వచ్చినట్లు తెలిసింది.