IndiGo Flight: సోమవారం నాడు కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లోని రన్‌వే నుండి బెంగళూరుకు వెళ్లే ఇండిగో విమానంలో బాంబు పెట్టినట్లు గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేయడంతో విమానాన్ని నిలిపివేసారు. కాల్ వచ్చినప్పుడు విమానం ఉదయం 10.30 గంటలకు షెడ్యూల్ ప్రకారం బయలుదేరడానికి రన్‌వేపై సిద్దంగా ఉంది.
బూటకపు కాల్..(IndiGo Flight)
ఒక చిన్నారి మరియు కార్గోతో సహా మొత్తం 139 మంది ప్రయాణికులను వెంటనే విమానం నుంచి దించి విమానాన్ని ఐసోలేషన్ పార్కింగ్ బేకు తరలించారు, అక్కడ క్షుణ్ణంగా తనిఖీలు చేసారు. ఆ తర్వాత బెదిరింపు బూటకమని తేలింది.ప్రోటోకాల్ ప్రకారం ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్ అధ్యక్షతన బాంబు బెదిరింపు అంచనా కమిటీని విమానాశ్రయంలో ఏర్పాటు చేసినట్లు విమానాశ్రయ అధికారులు అధికారిక ప్రకటనలో తెలిపారు. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF), బాంబ్ స్క్వాడ్, రాష్ట్ర పోలీసులు మరియు విమానాశ్రయంలోని ఎయిర్‌క్రాఫ్ట్ రెస్క్యూ అండ్ ఫైర్ ఫైటింగ్ (ARFF) మరియు భద్రతా విభాగాలకు చెందిన క్విక్ రియాక్షన్ టీమ్ (క్యూఆర్‌టి)తో కూడిన బృందాలు వెంటనే రంగంలోకి దిగాయి. .ప్రయాణీకుల సామాను కూడా రీస్క్రీన్ చేయబడ్డాయని మరియు అనుమానాస్పదంగా ఏమీ కనుగొనబడలేదు. తరువాత బయలుదేరడానికి ఫ్లైట్ క్లియర్ చేయబడిందని ఈలోగా ప్రయాణికుల అవసరాలను ఎయిర్‌లైన్స్ చూసుకుందని ప్రకటన లో తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి ఇంటర్నెట్ కాల్ మూలాన్ని కనుగొనడానికి దర్యాప్తు ప్రారంభించారు.