BJP : రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ.. తెలుగు రాష్ట్రాలకు నో ఛాన్స్..

ప్రస్తుతం రాజ్యసభలో ఖాళీ అయిన స్థానాలకు త్వరలో ఎన్నికలు జరగనున్నాయి.ఈ క్రమంలోనే తాజాగా రాజ్యసభకు అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది. ఇందులో తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరికీ చోటు దక్కకపోవడం గమనార్హం. ఈ వార్త పూర్తి వివరాల్లోకి వెళ్తే.. 

  • Written By:
  • Publish Date - July 12, 2023 / 05:24 PM IST

BJP : ప్రస్తుతం రాజ్యసభలో ఖాళీ అయిన స్థానాలకు త్వరలో ఎన్నికలు జరగనున్నాయి.ఈ క్రమంలోనే తాజాగా రాజ్యసభకు అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది. ఇందులో తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరికీ చోటు దక్కకపోవడం గమనార్హం. ఈ వార్త పూర్తి వివరాల్లోకి వెళ్తే..

ఈనెల 24వ తేదీన 10 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే గుజరాత్‌ నుంచి విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్‌ రాజ్యసభకు నామినేషన్‌ వేశారు. ఇప్పుడు తాజాగా మరో మూడు స్థానాలకు గాను బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. గుజరాత్‌లో మూడు, బెంగాల్‌లో ఆరు, గోవాలో ఓ రాజ్యసభ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. బీజేపీ ఐదు స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది.. రాజ్యసభ నామినేషన్ల గడువు రేపటితో ముగుస్తుంది.

రాజ్యసభకు జరగనున్న ఎన్నికల కోసం గుజరాత్ నుంచి.. బాబుభాయ్ జెసంగ్‌భాయ్ దేశాయ్, కేశ్రీవేవ్‌సిన్హ్ జాలా..  పశ్చిమ బెంగాల్ నుంచి.. అనంత మహారాజ్ లను అభ్యర్థులనుగా ప్రకటించింది. దెంతో గుజరాత్ నుంచి ఇద్దరు, పశ్చిమ బెంగాల్ నుంచి ఒకరు అభ్యర్థులుగా బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ ప్రకటించింది. మరోవైపు ఇరు తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరికీ అవకాశం దక్కకపోవడం గమనార్హం.