Bilkis Bano: బిల్కిస్ బానో ఈ పేర దేశవ్యాప్తంగా మార్మోగిన పేరు. గోద్రా అల్లర్ల సమయంలో.. సాముహిక అత్యాచారనికి గురై.. ఏడుగురు కుటుంబ సభ్యులను కోల్పోయిన బాధితురాలి పేరు. ఈ కేసులో నిందితులను గుజరాత్ ప్రభుత్వం గతేడాది విడుదల చేసిన విషయం తెలిసిందే.
బిల్కిస్ బానో ఈ పేర దేశవ్యాప్తంగా మార్మోగిన పేరు. గోద్రా అల్లర్ల సమయంలో.. సాముహిక అత్యాచారనికి గురై.. ఏడుగురు కుటుంబ సభ్యులను కోల్పోయిన బాధితురాలి పేరు. ఈ కేసులో నిందితులను గుజరాత్ ప్రభుత్వం గతేడాది విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ కేసులో దోషులను గడువుకు ముందే విడుదల చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో విచారణకు ప్రత్యేక ధర్మాసనాన్ని ఏర్పాటు చేయడానికి సుప్రీం కోర్టు అంగీకరించింది.
2000 సంవత్సరం గుజరాత్ అల్లర్లలో ఏడుగురు కుటుంబ సభ్యులను కోల్పోయిన బాధితురాలైన బిల్కిస్ బానోనే స్వయంగా సుప్రీంకోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేశారు.
అత్యాచార కేసులో 11 మంది దోషులను గడువుకు ముందే బీజేపీ సారథ్యంలోని గుజరాత్ ప్రభుత్వం గత ఏడాది ఆగస్టు 15న విడుదల చేసిన విషయం తెలిసిందే.
ఈ కేసులో ఏడుగురు కుటుంబ సభ్యులు ఊచకోతకు గురయ్యారు. అందులో మూడెళ్ల చిన్నారి కూడా ఉంది.
ఈ కేసును సీబీఐ చేపట్టగా, తుదుపరి విచారణను మహారాష్ట్ర కోర్టుకు సుప్రీంకోర్టు బదిలీ చేసింది. 2008 జనవరి 21న సీబీఐ ప్రత్యేక కోర్టు ఈ కేసులో 11 మందిని దోషులుగా నిర్ధారిస్తూ, యావజ్జీవ కారాగార శిక్ష విధించింది.
సుప్రీంకోర్టు నిర్దేశించిన చట్టపరమైన విధివిధాలను రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసి, యాంత్రికంగా దోషుల విడుదలకు ఆదేశాలిచ్చిందని తన పిటిషన్‌లో బిల్కిస్ బానో సుప్రీం దృష్టికి తీసుకు వచ్చారు. యావజ్జీవ శిక్ష పడిన దోషులను ముందస్తుగా విడిచిపెట్టడం తప్పుడు సంకేతాలకు తావిచ్చిందని పిటిషన్లో ఆమె పేర్కొన్నారు.
గోద్రా రైలును ఆందోళనకారులు తగులబెట్టిన అనంతరం చెలరేగిన అల్లర్లలో బిల్కిన్ బానో అత్యాచారానికి గురైంది. అప్పట్లో 21 ఏళ్ల వయస్సున్న ఆమె ఐదు నెలల గర్భవతి కూడా.
దీనితో పాటు బిల్సిస్ బానో కుటుంబ సభ్యులు ఏడుగురు ఊచకోతకు గురయ్యారు. వారిలో ఆమె ముడేళ్ల కూతురు కూడా ఉంది.
ఈ కేసును సీబీఐ చేపట్టగా, తుదుపరి విచారణను మహారాష్ట్ర కోర్టుకు సుప్రీంకోర్టు బదిలీ చేసింది.
2008 జనవరి 21న సీబీఐ ప్రత్యేక కోర్టు ఈ కేసులో 11 మందిని దోషులుగా నిర్ధారిస్తూ, యావజ్జీవ కారాగార శిక్ష విధించింది.
ఈ తీర్పును ఆ తర్వాత ముంబై హైకోర్టు, సుప్రీంకోర్టు ధ్రువీకరించాయి.
జైలులో సత్ప్రవర్తన పేరుతో గుజరాత్ ప్రభుత్వం దోషుల విడుదలకు అనుమతించడంతో గోద్రా సబ్ జైలు నుంచి 2022, ఆగస్టు 15న విడుదలయ్యారు.