Credit card fraud: దిల్లీలో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. క్రికెటర్లు, సినీ ప్రముఖుల పాన్ కార్డు వివరాలతో క్రెడిట్ కార్డులు తీసుకొని కేటుగాళ్లు హైటెక్ మోసానికి తెరతీశారు. ఏకంగా రూ.50 లక్షల మోసానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ మోసాల కోసం.. ఆన్ లైన్ లో కేటుగాళ్లు పరిశోధన చేసినట్లు పోలీసులు తెలిపారు.
క్రెడిట్ కార్డుతో మోసాలు.. (Credit card fraud)
సైబర్ నేరస్థులు రోజురోజుకు రెచ్చిపోతున్నారు. సామాన్యూలను వదలని సైబర్ కేటుగాళ్లు.. ఇప్పుడు ప్రముఖులను కూడా వదలడం లేదు. తాజాగా క్రికెటర్లు, సినీ ప్రముఖులను కూడా వీరు టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. క్రికెటర్లు, బాలీవుడ్ సెలబ్రిటీల వివరాలతో తప్పుడు పాన్ కార్డు, ఆధార్ వివరాలతో క్రెడిట్ కార్డులు పొందుతున్నారు. ఇలా క్రిడెట్ కార్డులతో.. ఏకంగా రూ.50 లక్షలకు టోకరా వేసినట్లు పోలీసులు తెలిపారు. ఆన్‌లైన్ లో జీఎస్టీ ఐడెంటిఫికేషన్ నంబర్లు సేకరించి.. ప్రముఖ ఫిన్‌టెక్ స్టార్టప్ కంపెనీ వన్ కార్డు నుంచి క్రెడిట్ కార్డులు పొంది ఈ మోసానికి తెరతీశారు. మోసాన్ని గుర్తించిన కంపెనీ.. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఐదుగురిని అరెస్ట్ చేశారు. ఎంఎస్ ధోనీ, అభిషేక్ బచ్చన్, సోనమ్ కపూర్, సచిన్ తెందూల్కర్, సైఫ్ అలీఖాన్, అలియాభట్, శిల్పాశెట్టి, ఇమ్రాన్ హష్మీ తదితరుల సెలబ్రిటీల వివరాలు ఉన్నట్లు దిల్లీ పోలీసులు తెలిపారు.
వివరాలు ఇలా సంపాదించారు..
సైబర్ నేరగాళ్లు రోజుకో మార్గం వెతుక్కుంటున్నారు. డబ్బు సంపాదనే లక్ష్యంగా.. వక్ర మార్గాల్లో వ్యక్తుల సమాచారాన్ని దుర్వినియోగం చేస్తున్నాుర. ఈ మోసానికి పాల్పడటానిక ముందు సెలబ్రిటీల జీఎస్టీ వివరాలను గూగుల్ లో సేకరించారు. సాధారణంగా జీఎస్టీఐఎన్‌లో ఉండే తొలి రెండు అంకెలు స్టేట్ కోడ్‌ను సూచిస్తాయి. మిగితా10 అంకెల్లో పాన్ నంబర్ ఉంటుంది. సెల్రబిటీలకు సంబంధించిన పుట్టిన తేదీ ఇతర వివరాలు గూగుల్‌లో లభించడం వీరికి సులవైంది. పుట్టిన తేదీ, పాన్ వివరాలు లభించడంతో వీరు కొత్త పాన్ కార్డుకు వారి వ్యక్తిగత చిత్రాలతో అప్లయ్ చేశారు. వీడియో వెరిఫికేషన్ సమయంలో పాన్/ ఆధార్ వివరాలు వీరి చిత్రాలు సరిపోలే విధంగా జాగ్రత్త పడ్డారు. దీంతో వీరు క్రెడిట్ కార్డు కోసం అప్లయ్ చేశారు.
రెండు నెలల పరిశోధన
వీడియో వెరిఫికేషన్ సమయంలో ఎలాంటి పొరపాటు లేకుండా జాగ్రత్త తీసుకుంటున్నారు. సెలబ్రిటీల తాలుకా ఆర్థిక కార్యకలాపాల వివరాలు ముందే సేకరించి పెట్టుకుంటున్నారు. క్రెడిట్ కార్డుల జారీ
వెరిఫికేషన్‌లో లోపాల గురించి పరిశోధించారు. వీడియో వెరిఫికేషన్ కంటే ముందు క్రెడిట్ కార్డు కోసం యాప్‌లో పాన్, ఆధార్ వివరాలను తమ యాప్ ద్వారా అప్‌లోడ్ చేసినట్లు సదరు సంస్థ ఫిర్యాదులో పేర్కొంది. అసలు పాన్ కార్డు, ఆధార్ వివరాల స్థానే నకిలీ పాన్, ఆధార్ వివరాలు ఇచ్చారని ఆ కంపెనీ పేర్కొంది. నకిలీ గుర్తింపుతో దరఖాస్తు చేసినప్పటికీ.. బ్యూరో వద్ద ఉన్న పాన్, క్రెడిట్ లిమిట్ వివరాల ఆధారంగా ఒక్కో క్రెడిట్ కార్డుకు రూ.10 లక్షల లిమిట్ చొప్పున జారీ చేసినట్లు కంపెనీ పేర్కొంది. కేవలం ఫిజికల్ కార్డుతోనే కాకుండా.. వన్‌కార్డు, వన్ స్కోరు యాప్ ద్వారా కూడా వర్చువల్ క్రెడిట్ కార్డును ఆన్‌లైన్, యాప్ ఆధారిత లావాదేవీలకు వినియోగించే సదుపాయం ఉండడంతో కేటుగాళ్ల పని సులువు అయ్యింది. కేటుగాళ్లు పేర్కొన్న అడ్రస్‌లకు కొన్ని ఫిజికల్ కార్డులను సైతం పంపించినట్లు కంపెనీ పేర్కొంది.
ఫిర్యాదుతో వెలుగులోకి..
సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. క్రెడిట్ కార్డు సంపాదించాక లక్షల్లో క్రెడిట్ లిమిట్ ను వారం వ్యవధిలోనే వినియోగించారు. పైగా ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించలేదని వన్‌కార్డు తన ఫిర్యాదులో పేర్కొంది. ఒకే డివైజ్ నుంచి బహుళ దరఖాస్తులు రావడంతో తమ వ్యవస్థ గుర్తించి అలర్ట్ చేసిందని ఫిర్యాదులో తెలిపింది. ఈ విధంగా 7 వేర్వేరు డివైజుల నుంచి 83 నకిలీ పాన్ కార్డు వివరాలతో ప్రయత్నించారని పేర్కొంది. మోసాన్ని గుర్తించిన వెంటనే వన్‌కార్డు సంస్థ దిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది.