Site icon Prime9

Rahul Gandhi: రాహుల్ గాంధీ పై కేసు నమోదు చేసిన బెంగళూరు పోలీసులు

Rahul Gandhi

Rahul Gandhi

Bengaluru: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పై బెంగళూరు పోలీసులు కేసు నమోదు చేశారు. భారత్ జోడో యాత్రలో కేజీఎఫ్ 2 పాటల కాపీరైట్ ఉల్లంఘనకు పాల్పడ్డారంటూ కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్, సోషల్ మీడియా హెడ్ సుప్రియా శ్రీనాటేలపై ఎఫ్ఐఆర్ నమోదైంది. కాంగ్రెస్ సోషల్ మీడియాలో రాహుల్ గాంధీని కేజీఎఫ్ స్టైల్‌లో చూపించే వీడియోను ప్రదర్శించి సినిమా పాటను ఉపయోగించారు.

దీనితో సదరు పాటల హక్కుల్ని కొనుగోలు చేసిన ఎమ్ఆర్ టీ మ్యూజిక్ కంపెనీ, ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాపీరైట్ ఉల్లంఘనగా దీన్ని పరిగణిస్తూ రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ జైరాం రమేశ్, కాంగ్రెస్ సోషల్ మీడియా హెడ్ సుప్రియా శ్రీనటే పై బెంగళూరు సిటీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తమ చట్టబద్ధమైన హక్కుల మేరకే కాంగ్రెస్ పార్టీ పై కేసు పెట్టామని, ఏ రాజకీయ పార్టీ ప్రతిష్ఠకు భంగం కలిగించే ఉద్దేశం తమ కంపెనీకి లేదని పేర్కొన్నారు.

తమ కంపెనీ దగ్గర 20 వేలకు పైగా తెలుగు, తమిళ, హిందీ, కన్నడ పాటల మ్యూజిక్ హక్కులు ఉన్నాయని ఎమ్ఆర్ టీ మ్యూజిక్ సంస్థ పేర్కొంది. ఈ రైట్స్ కోసం బోలెడంత డబ్బు పెట్టుబడిగా పెట్టామని, అయితే కాంగ్రెస్ పార్టీ, తమ సంస్థ నుంచి ఎలాంటి అనుమతులు, లైసెన్స్ తీసుకోకుండానే కేజీఎఫ్ 2 సాంగ్స్ ఉపయోగించిందని ఎమ్ఆర్ టీ సంస్థ తెలిపింది. రాహుల్ జోడో యాత్రలో తమ పాటల్ని ఉపయోగించారని, ఇది కాపీరైట్ ఉల్లంఘన కిందకు వస్తుందని పేర్కొంది.

Exit mobile version