Site icon Prime9

Azam Khan: ద్వేషపూరిత ప్రసంగం కేసు.. సమాజ్ వాదీ నేత అజం ఖాన్ శాసనసభ్యత్వం రద్దు

azam-khan

azam-khan

Uttar Pradesh: ద్వేషపూరిత ప్రసంగం కేసులో సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు ఆజం ఖాన్‌కు కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించిన  విషయం తెలిసిందే. తాజాగా ఉత్తరప్రదేశ్ శాసనసభ సెక్రటేరియట్ అతనిపై అనర్హత వేటు వేసింది. రాంపూర్ సదర్ అసెంబ్లీ స్థానం ఖాళీగా ఉందని అసెంబ్లీ సచివాలయం ప్రకటించినట్లు యూపీ శాసనసభ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రదీప్ దూబే తెలిపారు. అజం ఖాన్‌కు 3 సంవత్సరాల జైలు శిక్ష విధించినందున, అతను ఇప్పుడు ఉభయ సభలకు అనర్హుడయ్యాడు. ఇప్పుడు రాంపూర్ సదర్ అసెంబ్లీ స్థానం ఖాళీగా ఉంది, కాబట్టి ఎన్నికల్లో ఎప్పుడు పోటీ చేసినా కమలం వికసిస్తుంది అని యూపీ డిప్యూటీ సీఎం అన్నారు కేపీ మౌర్య .

ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం ఎవరైనా రెండు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం జైలు శిక్ష విధించబడితే “అటువంటి నేరం రుజువైన తేదీ నుండి” అనర్హులుగా ప్రకటించబడతారు మరియు జైలులో గడిపిన తర్వాత మరో ఆరు సంవత్సరాలు అనర్హులుగా ఉంటారు. 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో అజంఖాన్ మిలక్ కొత్వాలి ప్రాంతంలోని ఖతానగారియా గ్రామంలో బహిరంగ సభలో ద్వేషపూరిత ప్రసంగం చేసినందుకు అతనిపై కేసు నమోదైంది. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. చీటింగ్ కేసులో సుప్రీంకోర్టు అతనికి మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో ఖాన్ ఈ ఏడాది ప్రారంభంలో జైలు నుంచి విడుదలయ్యాడు. దాదాపు రెండేళ్లు జైలు జీవితం గడిపాడు. అజంఖాన్ పై అవినీతి, దొంగతనం సహా దాదాపు 90 కేసులు ఉన్నాయి.

అజంఖాన్ గత యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో రాంపూర్ సదర్ అసెంబ్లీ స్థానం నుంచి 10వ సారి విజయం సాధించారు. ఎమ్మెల్యే అయిన తర్వాత లోక్ సభకు రాజీనామా చేశారు. ఈ ఏడాది జూన్‌లో బీజేపీకి చెందిన ఘన్‌శ్యామ్ లోధి సమాజ్‌వాదీ పార్టీ నుండి రాంపూర్ పార్లమెంటరీ స్థానాన్ని కైవసం చేసుకున్నారు.

Exit mobile version