Site icon Prime9

Miss India Contest 2023: “మిస్ ఇండియా” అవ్వలనుకుంటున్నారా.. అయితే ఇప్పుడే అప్లై చేసుకోండిలా..!

applications-invited-for-miss-india-2023

applications-invited-for-miss-india-2023

Miss India Contest 2023: భారత్ లో అందాల పోటీల గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అందం అతివల సొంతం అంటుంటారు. అలాంటి అందాల పోటీలకు భారత్ నెలవు. మిస్ యూనివర్స్, మిస్ వరల్డ్ గా కూడా భారత మగువలు అంతర్జాతీయ స్థాయిలోనూ సత్తా చాటారు. ద మిస్ ఇండియా ఆర్గనైజేషన్ (ఎంఐఓ) నిర్వహించే ఈ పోటీలకు గత ఆరు దశాబ్దాలుగా ఫెమీనా భాగస్వామిగా నిలుస్తోంది. భారత్ లో ఈ అందాల పోటీలు ఫెమీనా పేరుమీదే ఫెమీనా మిస్ ఇండియా పోటీలుగా పేరుగాంచాయి.

ఈ నేపథ్యంలోనే 2023 మిస్ ఇండియా పోటీలకు ప్రకటన వెలువడింది. ఈ 59వ మిస్ ఇండియా అందాల పోటీలు మణిపూర్ లో నిర్వహించనున్నారు. దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి అందాల భామలకు ఆహ్వానం పలుకుతున్నట్టు ఎంఐఓ వెల్లడించింది. ఢిల్లీ, జమ్మూ కశ్మీర్ సహా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో అందాల పోటీలు నిర్వహించి 30 మందితో తుది జాబితా రూపొందించి, వారి నుంచి ఒక అందాల సుందరికి మిస్ ఇండియా కిరీటం కైవసం చెయ్యనున్నట్టు పేర్కొనింది.

అందాల పోటీల్లో పాల్గొనేందుకు అర్హతలు
వయసు: 18 నుంచి 25 ఏళ్ల లోపు ఉండాలి.
ఎత్తు: 5.3 అడుగులు, ఆపైన
బరువు: 51 కిలోలు మించకూడదు
రిలేషన్ షిప్ స్టేటస్: అవివాహితులై ఉండాలి. ఎవరితోనూ నిశ్చితార్థం జరిగి ఉండకూడదు. గతంలో పెళ్లి చేసుకుని విడిపోయిన వారు అనర్హులు
నేషనాలిటీ: భారతీయులై ఉండాలి. భారత పాస్ పోర్టు కలిగి ఉండాలి. ఓవర్సీస్ సిటిజెన్ ఆఫ్ ఇండియా (ఓసీఐ) కార్డు కలిగి ఉన్న వారు కేవలం సెకండ్ రన్నరప్ కోసం పోటీ పడేందుకు అర్హులు

మిగిలిన వివరాలు మరియు దరఖాస్తు కోసం www.missindia.com వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవాలని ఎంఐఓ వెల్లడించింది.

ఇదీ చదవండి: ట్రోలర్స్ కి అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన సీతారామం బ్యూటీ

Exit mobile version