Apple Stores: దిగ్గజ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ యాపిల్ భారత్‌లో స్టోర్లను ప్రారంభించింది. భారత్ లో తొలి రిటైల్ స్టోర్ అయిన యాపిల్ బీకేసీని సీఈఓ టిమ్ కుక్ ప్రారంభించారు. ఆయనే స్వయంగా స్టోర్ తలుపులు తెరిచి కస్టమర్లను ఆహ్వానించారు. ఈ మేరకు భారతదేశంలో స్టోర్స్ ఓపెన్ చేస్తుండటంపై ఆ సంస్థ హర్షం వ్యక్తం చేసింది. భారత మార్కెట్ లో యాపిల్ అడుగుపెట్టి 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రెండు స్టోర్లు ప్రారంభం అయ్యాయి.
WATCH: Apple CEO Tim Cook opens the doors of India's first Apple Store, in Mumbai's BKC business district.
Years in the works, Apple was finally allowed to launch outlets in India after meeting regulators’ demands https://t.co/4LpQhkL8aL pic.twitter.com/K6EIftaH3i
— Bloomberg (@business) April 18, 2023
ముంబయిలో తొలి స్టోర్.. (Apple Stores)
దిగ్గజ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ యాపిల్ భారత్‌లో స్టోర్లను ప్రారంభించింది. భారత్ లో తొలి రిటైల్ స్టోర్ అయిన యాపిల్ బీకేసీని సీఈఓ టిమ్ కుక్ ప్రారంభించారు.
ఆయనే స్వయంగా స్టోర్ తలుపులు తెరిచి కస్టమర్లను ఆహ్వానించారు. ఈ మేరకు భారతదేశంలో స్టోర్స్ ఓపెన్ చేస్తుండటంపై ఆ సంస్థ హర్షం వ్యక్తం చేసింది.
భారత మార్కెట్ లో యాపిల్ అడుగుపెట్టి 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రెండు స్టోర్లు ప్రారంభం అయ్యాయి.
ముంబయిలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో ఈ స్టోర్ ను ఏర్పాటు చేశారు. భారతదేశంలో వేగంగా విస్తరించేందుకు.. యాపిల్ రిటైల్ స్టోర్లను అందుబాటులోకి తెచ్చింది.
ఇక రెండో స్టోర్ దిల్లీలో ప్రారంభం కానుంది.
ఈ స్టోర్‌లో కస్టమర్లు యాపిల్ ఉత్పత్తులన్నింటినీ కొనుగోలు చేయొచ్చు. అలాగే ఇతర సేవలను కూడా పొందొచ్చు.
ప్రపంచవ్యాప్తంగా యాపిల్ కి 500 రిటైల్ స్టోర్లు ఉన్నాయి. భారత్ లో విక్రయాలు సైతం జోరు పెరగడంతో ఇక్కడి మార్కెట్ పై యాపిల్ దృష్టి సారించింది.
అందుకు అనుగుణంగానే స్టోర్ల ఏర్పాటుపై ఫోకస్ చేసింది. స్టోర్లను ప్రారంభించడం వల్ల మరింత మంది కస్టమర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది.
యాపిల్ బీకేసీ ప్రత్యేకతలు..
కస్టమర్లు ఈ స్టోర్ మొత్తం తిరగొచ్చు. ఇందులో తమకు నచ్చిన యాపిల్ ప్రొడక్ట్ డెమోను అడిగి తెలుసుకోవచ్చు.
డివైజ్ ఆపరేట్ విషయంలో యాపిల్ ప్రతినిధులు సాయం చేస్తారు. ఇక స్టోర్ లోనే ఒక బృందం యాపిల్ ఉత్పత్తులపై అవగాహనా కల్పిస్తుంటుంది.
ఈ స్టోర్ లలో యాపిల్ ప్రొడక్ట్‌లకు సంబంధించి ఎలాంటి సేవలనైనా అందిస్తారు.
మొత్తం 20 భారతీయ భాషల్లో మాట్లాడే ప్రతినిధులు అందుబాటులో ఉంటారు.
ఈ స్టోర్ నుంచి ‘యాపిల్ పికప్’ సర్వీస్‌ను కూడా అందిస్తున్నారు. ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసి కస్టమర్లు తమకు కావాల్సిన చోట యాపిల్ ఉత్పత్తులను డెలివరీ తీసుకోవచ్చు.
ఈ స్టోర్ పూర్తిగా పునరుత్పాదక ఇంధనంపైనే నడుస్తుంది.ఎక్కడా శిలాజ ఇంధనాలను వినియోగించబోరని యాపిల్ తెలిపింది.
కొత్త అనుభూతిని అందిస్తాం..
ఏప్రిల్ 18 న యాపిల్ తన తొలి స్టోర్‌ను ముంబైలో లాంచ్ చేసింది. అదేవిధంగా ఏప్రిల్ 20న డిల్లీలో రెండో స్టోర్ తెరుచుకోనుంది.
భారత్‌లో స్టోర్లు తెరవడం, కొత్త పర్యావరణహిత కార్యక్రమాలు చేపట్టడం సంస్థ కీలక మైలురాయి అని యాపిల్ పేర్కొంది.
భారత్ లో రూపొందించిన రెండు స్టోర్లు ఇక్కడి వినియోగదారులకు కొత్త అనుభూతిని అందిస్తాయని కంపెనీ తెలిపింది.
ఈ క్రమంలో దేశవ్యాప్తంగా వేలాది ఉద్యోగాల కల్పించడానికి కట్టుబడి ఉన్నామని చెప్పింది.