Site icon Prime9

Jairam Ramesh: భాజపా వ్యతిరేక ఫ్రంట్ మూర్ఖుల స్వర్గమే

Anti-BJP front is a fool's paradise

Anti-BJP front is a fool's paradise

Jairam Ramesh: 2024 లోక్‌సభ ఎన్నికల్లో అధికార పీఠాన్ని భాజాపాకు దక్కకుండా వ్యతిరేకంగా ఉమ్మడి పొత్తు కోసం అనేక విపక్షాలు ప్రయత్నాలు చేస్తున్నాయన్నారు. ప్రతిపక్షాల ఐక్యత గురించి మాట్లాడే వారు ప్రతిపక్ష ఫ్రంట్‌ను, కాంగ్రెస్ ను బలహీనపరచాలని మాత్రమే కోరుకుంటున్నారని వ్యాఖ్యానించారు. కానీ వారు గుర్తుపెట్టుకోవాల్సి ఒకటుందన్నారు. కాంగ్రెస్ లేకుండా ప్రతిపక్ష ఐక్యత ఉండదని తేల్చి చెప్పారు.

ప్రాంతీయ పార్టీలు స్వప్రయోజనాల కోసం కాంగ్రెస్‌ను వెన్నుపోటు పొడిచాయన్నారు. అలాంటి పార్టీలు కాంగ్రెస్‌ను పంచింగ్ బ్యాగ్‌గా వాడుకోవడం మానుకోవాలని హితవు పలికారు. ప్రతిపక్ష పార్టీ కూటమిలో ఏదో ఇచ్చామంటూ ప్రతిఫలంగా చాలా స్వీకరిస్తారన్నారు. కాని ఇప్పటివరకు కాంగ్రెస్ అలాంటి ఆఫర్ చేసిందన్నారు. దాని వల్ల చాలా పార్టీలు లబ్ధిపొందాయని పేర్కొన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ను ఉపయోగించుకోవాలని చేస్తున్న ప్రయత్నాలను చేపట్టడం సరికాదన్నారు.

కాంగ్రెస్‌ను జాతీయ రాజకీయాలకు దూరంగా ఉంచడం అనేది అవివేకంగా జైరాం రమేష్ చెప్పుకొచ్చారు. యుపిఎకు సమాంతరంగా ప్రతిపక్ష కూటమిని ఏర్పాటు చేయడం అంటే అధికార భాజాపాతోపాటు ఫాసిస్ట్ శక్తులకు బలోపేతానికి మాత్రమే ఉపయోగపడుతుందని గతంలో శివసేన అన్న మాటలను గుర్తుచేశారు.

వాస్తవానికి కాంగ్రెస్ పార్టీని దూరం పెట్టేందుకు చాలా ప్రాంతీయ పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ఇందులో తృణముల్ కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్, ఆప్ పార్టీలు ప్రత్యేక ఫ్రంట్ పై వారి వారి ఆలోచనలతో ముందుకు సాగుతున్నారు. అయితే విపక్షాలలో కూడా కాంగ్రెస్ లేకుండా ప్రత్యామ్నాయ ఫ్రంట్ సాధ్యమా అన్న మీమాంస కూడ లేకపోలేదు. రానున్న ఎన్నికల నేపధ్యంలో టీఆర్ఎస్ పార్టీ ఆచితూచి అడుగులు వేస్తుంది. పంజాబ్ విజయంతో కాంగ్రెస్, భాజపాలకు ప్రత్యామ్నాయం ఒక్క ఆప్ గానే ఆ పార్టీ అగ్రనేత అరవింద్ కేజ్రీవాల్ మరింతగా తన ప్రచార వ్యూహ్యాన్ని పెంచారు.

Exit mobile version