Site icon Prime9

Manipur Violence: అట్టుడుకుతున్న మణిపూర్.. మరోమారు చెలరేగిన హింసాత్మక ఘటనలు

Manipur Violence: మణిపూర్‌లో కొద్దిరోజులుగా అల్లర్లు చెలరేగుతూనే ఉన్నాయి. షెడ్యూల్డు తెగల జాబితాలో ఉన్నవారు కొన్ని రోజుల క్రితం ప్రారంభించిన ఈ నిరసన కార్యక్రమాలు మరింత హింసాత్మకంగా మారాయి. దీనితో ఆ రాష్ట్రమంతా అల్లకల్లోలం అవుతుంది. స్వయంగా కేంద్రహోం మంత్రి అమిత్ షా ఆ రాష్ట్రంలో పర్యటించి అన్ని వర్గాల నేతలతో మాట్లాడినప్పటికీ నిరసనలు సద్దుమనగం లేదు. ఈ నేపథ్యంలో తాజాగా శుక్రవారం రాత్రి కొంతమంది దుండగులు ఆటోమేటిక్ తుపాకులను ధరించి.. బిష్ణుపూర్ జిల్లాలోని క్వక్ట, చురాచాంద్‌పూర్‌లోని కంగ్వాయ్ ప్రాంతాల్లో ఇష్టమొచ్చినట్టు కాల్పులు జరిపారు. ఈ కాల్పులు శనివారం తెల్లవారుజాము వరకు కొనసాగినట్టు అక్కడి ప్రజలు తెలిపారు.

మొన్న అలా.. నిన్న ఇలా(Manipur Violence)

శుక్రవారం సాయంత్రం దాదాపు 1000 మంది దుండగులు విధ్వంసం చేసేందుకు యత్నించగా సమాచారం అందుకున్న ఆర్‌ఏఎఫ్ సిబ్బంది.. దుండగులను తరిమేందుకు రబ్బర్ బుల్లేట్లు, టీయర్ గ్యాస్‌లను ప్రయోగించారు. దీనితో కొందరి గాయాలయ్యాయి. అలాగే అదే రోజు రాత్రి తొంగ్జూ ప్రాంతంలో ఎమ్మెల్యే ఇంటిపై మరియు ఇరింగ్‍బామ్‌లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రద్దదేవి నివాసంపై దుండగులు దాడి చేసేందుకు యత్నించారు. వెంటనే అలర్ట్ అయిన ఆర్మీ సిబ్బంది దుండగుల చర్యలను అడ్డుకుని వారిని తరిమేశారు. అలాగే మణిపూర్ యూనివర్శిటీ దగ్గర్లో కూడా గొడవలు జరిగినట్లు తెలుస్తోంది.

మణిపూర్‌లో గురువారం రోజు రాత్రి దాదాపు 1200 మంది దుండగులు కేంద్రమంత్రి ఆర్‌కే రంజన్ సింగ్ ఇంటిని తగలబెట్టిన మరుసటి రోజే మళ్లీ ఘర్షణలు చెలరేగడం మరింత ఆందోళనను కలిగిస్తోంది. అక్కడ శాంతి భద్రతలు కాపాడేందుకు అధికారులు కర్ఫ్యూలు విధించినప్పటికీ ఇంకా పలు ప్రాంతాల్లో మరింత విధ్వంసం చెలరేగుతుండడం తీవ్ర భయాందోళనను కలిగిస్తోంది.

Exit mobile version
Skip to toolbar