Site icon Prime9

Anju Returned: ఫేస్ బుక్ ఫ్రెండ్ కోసం పాకిస్తాన్ వెళ్లి.. భారత్ కు తిరిగి వచ్చిన అంజు

Anju Returned

Anju Returned

 Anju Returned: జూలైలో తన ఫేస్‌బుక్ స్నేహితుడిని పెళ్లి చేసుకునేందుకు పాకిస్థాన్ వెళ్లిన రాజస్థాన్‌కు చెందిన అంజు రాఫెల్ అనే 34 ఏళ్ల మహిళ బుధవారం భారత్‌కు తిరిగి వచ్చింది.నేను సంతోషంగా ఉన్నాను. నాకు వేరే ఆలోచనలు లేవు అని అంజు తిరిగి వచ్చిన తర్వాత విలేకరులతో అన్నారు. అంజు పాక్‌లో తన ప్రియుడు నస్రుల్లాను పెళ్లి చేసుకొని ప్రస్తుతం ఫాతిమాగా మారిపోయింది. వాఘా బోర్డర్‌ ద్వారా అమృత్‌సర్‌ చేరుకున్న అంజు తన పిల్లలను తీసుకొని తిరిగి పాకిస్తాన్‌ వెళ్తానంటున్నారు.

విడాకులు తీసుకుని ..( Anju Returned)

పంజాబ్‌ పోలీసులు ఇంటెలిజెన్స్‌ అధికారులు ఆమెను క్షుణ్ణంగా విచారించిన తర్వాత విడిచిపెట్టారు. ఆమె అమృత్‌సర్‌ నుంచి ఢిల్లీకి విమానంలో బయలుదేరారు. బుధవారం రాత్రి దిల్లీ చేరుకున్నారు. విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం పాకిస్తాన్‌లో ఆమె ఎవరైనా రక్షణ రంగానికి చెందిన వారిని కలిశారని అని ప్రశ్నించినట్లు తెలిసింది. అయితే దీన్ని ఆమె నిర్ద్వందంగా ఖండించారు. విచారణ సందర్భంగా ఆమె ఇండియాలో తన ప్లాన్‌ గురించి వివరించారు. ఇండియాలో ఉన్న తన పిల్లలను తీసుకొని తిరిగి పాకిస్తాన్‌ వెళ్లిపోతానని చెప్పినట్లు తెలుస్తోంది. ముందుగా తన భర్త అరవింద్‌కు విడాకులు ఇస్తానని చెప్పారు.ఇదే విషయాన్ని అంజు భర్త అరవింద్‌ వద్ద ప్రస్తావించగా తనకు ఆమె గురించి ఏమీ తెలియదు.పాకిస్తాన్‌ నుంచి వచ్చిన విషయం తెలియదన్నారు. అదీ కాకుండా ఆమె గురించి మాట్లాడ్డం తనకు ఇష్టంలేదన్నాడు.

ఇంటెలిజెన్స్‌ అధికారుల విచారణ..

విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం ఇంటెలిజెన్స్‌ అధికారులు ఆమెను పాకిస్తాన్‌లో దీర్ఘకాలం పాటు ఎలా ఉన్నారు అని ప్రశ్నించినట్లు తెలిసింది. కాగా ఆమె వీసా కేవలం ఒక నెల పాటు మాత్రమే పాకిస్తాన్‌ ఇచ్చినట్లు సమాచారం. ఒక నెల రోజుల పాటు మిత్రుడుతో గడిపి తిరిగి స్వదేశానికి వస్తానని చెప్పారు. అయితే విచారణ సందర్భంగా ఆమె తాను ఈ ఏడాది జులై 27వ తేదీన పాకిస్తాన్‌ వెళ్లానని… ఇస్లాం మతంలోకి మారి నస్రుల్లాను పెళ్లి చేసుకున్నట్లు చెప్పారు. తన భర్త వివరాల గురించి ప్రస్తావిస్తూ భర్త పేరు నస్రుల్లా ఆయన తండ్రి గుయిముల్లా ఖాన్‌, ఇంటి అడ్రస్‌ మొహల్లా కల్సూ పోస్ట్‌ డీర్‌ జిల్లా … ఖైబర్‌ ఫక్తూన్‌ క్వా పాకిస్తాన్‌ అని చెప్పారు. అయితే దీనికి సంబంధించి ఆమె ఎలాంటి సాక్ష్యాలు చూపించలేదని తెలుస్తోంది.

నస్రుల్లాతో పెళ్లి చేసుకున్నట్లు ఆమె ఎలాంటి డాక్యుమెంట్లు చూపించలేదు. తన భర్త నస్రుల్లా మెడిసిన్‌ బిజినెస్‌లో ఉన్నారని తన భర్త వ్యాపారం గురించి వివరించారు. ఇక అంజు విషయానికి వస్తే .. భారతీయ పౌరసత్వం కలిగి ఉన్నారు. రాజస్తాన్‌లోని భివాండి జిల్లాకు చెందిన వారు. ఈ ఏడాది ప్రారంభంలోనే ఆమె ఇండియా నుంచి పాకిస్తాన్‌ వెళ్లి అక్కడ తన ఫేస్‌బుక్‌ మిత్రుడు నస్రుల్లాను పెళ్లి చేసుకోవడం దేశవ్యాప్తంగా పెద్ద దుమారమే రేపింది. పాకిస్తాన్‌ వెళ్లే ముందు తన భర్త అరవింద్‌తో తాను కొన్ని రోజుల పాటు జైపూర్‌ వెళ్లి వస్తానని చెప్పి నేరుగా అమృత్‌సర్‌ వెళ్లి అక్కడి నుంచి వాఘా సరిహద్దు ద్వారా పాకిస్తాన్‌లోని ఖైబర్‌ ఫక్తూన్‌ క్వాకు చేరుకున్నారు.

Exit mobile version