Anant Ambani pre-wedding bash: అంబానీల ఇంట వేడుకలు అంటే మాటల! యావత్ ప్రపంచం దృష్టి అంబానీ ఇంట జరిగే ఈవెంట్‌లపైనే ఉంటోంది. అనంత్ అంబానీ ప్రీ ఈవెంట్ వెడ్డింగ్ -1 జామ్ నగర్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సెలెబ్రిటిలు హాజరయ్యారు. బిల్ క్లింటన్ నుంచి మెటా చీఫ్ మార్క్ జుకర్‌బర్గ్ వరకు హాజరయ్యారు. కాగా ఈ ఈవెంట్‌కు గ్లోబల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున కవరేజ్ లభించింది. ఇక ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ -2 కు కూడా ఇటలీలో భారీ ఏర్పాటు చేస్తున్నారు.
క్రూయిజ్‌లో ప్రీ వెడ్డింగ్ ఈవెంట్..(Anant Ambani pre-wedding bash)
ఈ ఈవెంట్‌కు బాలీవుడ్ టాప్ స్టార్‌తో పాటు హాలీవుడ్ స్టార్‌లు కూడా హాజరువుతున్నారు. సోషల్ మీడియాలో దీనికి సంబంధించి పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. అంబానీ కుటుంబం ఈ సారి ప్రీ వెడ్డింగ్ ఈవెంట్‌ను ఇటలీ నుంచి సౌత్ ఫ్రాన్స్‌వరకు క్రూయిజ్‌లో ఏర్పాటు చేశారు. కాగా వచ్చిన గెస్ట్‌లకు ఎంటర్‌టెయిన్ చేయడానికి 90లో యావత్ ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన బ్యాక్ స్ర్టీట్‌బాయిస్‌ను రప్పిస్తున్నారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి.
జూలై 12న పెళ్లి..
బ్యాక్ స్ర్టీట్ బాయ్స్‌తో పాటు పిట్‌బుల్, షకీరాలు కూడా ప్రీ వెడ్డింగ్‌లో హల్‌చల్ చేయబోతున్నారని వినికిడి. అయితే అధికారికంగా దీనికి సంబంధించి ఎలాంటి సమాచారం లేదు. అయితే జామ్‌నగర్‌లో జరిగిన ప్రీ వెడ్డింగ్ ఈవెంట్‌లో రిహానా పాల్గొన్న విషయం తెలిసిందే.కాగా ఇటలీ నుంచి దక్షిణ ఫ్రాన్స్‌కు వీరి లగ్జరీ క్రూస్ ఈ నెల 29న బయలుదేరి జూన్ 1న చేరుతుందని సమాచారం. విలాసవంతమైన ఈ క్రూస్‌లో సుమారు 800 మంది కంటే ఎక్కువ మంది గెస్ట్‌లను ఆహ్వానించారని చెబుతున్నారు. కాగా అనంత్ అంబానీ, రాధికా మర్చంట్‌కు జులై 12న మూడు ముళ్లు వేయనున్నారు.