Amritpal Singh: పోలీసులకు చిక్కని అమృత్‌పాల్ సింగ్.. పంజాబ్ లో ఇంటర్నెట్ సేవలు బంద్

Amritpal Singh: ఖలిస్తాన్ వేర్పాటువాద నేత అమృత్‌పాల్ సింగ్‌ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిని వంద వాహనాల్లో పోలీసులు వెంబడించి.. జలంధర్ పట్టణంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి అరెస్టు నేపథ్యంలో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు.

Amritpal Singh: ఖలిస్తాన్ వేర్పాటువాద నేత అమృత్‌పాల్ సింగ్‌ ను వంద వాహనాల్లో పోలీసులు వెంబడించి.. జలంధర్ పట్టణంలో అదుపులోకి తీసుకోవాలని ప్రయత్నించారు.  అయితే పోలీసుల రాకను పసిగట్టిన అమృత్‌పాల్ సింగ్ చివరి నిమిషంలో పరారయ్యాడు.

100 కార్లతో ఛేజింగ్  .. (Amritpal Singh)

పంజాబ్ లో తీవ్ర అల్లర్లకు కారణమైన అమృత్‌పాల్‌ సింగ్‌ ను సినీ ఫక్కీలో 100 కార్లలో వెంబడించారు. ఎలాంటి ఉద్రిక్తతలు తలెత్తకుండా పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ఈ మేరకు పంజాబ్ లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. కొన్ని ప్రాంతాల్లో అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ స్థాయిలో పోలీసులు మోహరించారు. అమృత్‌పాల్ సింగ్‌ వారిస్ పంజాబ్ దె చీఫ్‌గా కొనసాగుతున్నాడు. ఈ సంస్థ ద్వారా.. ఖలిస్తాన్ సిక్కు యువతను ఉద్యమం వైపు నడిపిస్తున్నాడు.

ఇంటర్నెట్ సేవలు బంద్..

అమృత్ పాల్ సింగ్ అరెస్టుతో పంజాబ్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ మేరకు అక్కడి ప్రభుత్వం ఇంటర్నెట్ సేవలను నిలిపివేసిందిఅమృత్‌ పాల్‌ సింగ్‌కు అత్యంత సన్నిహితుడైన లవ్‌ప్రీత్‌ సింగ్‌ అలియాస్‌ తూఫాన్‌ సింగ్‌ను ఇటీవల పంజాబ్‌ పోలీసులు ఓ కిడ్నాప్‌ కేసులో అరెస్టు చేశారు. దాన్ని వ్యతిరేకిస్తూ అమృత్‌పాల్‌ పిలుపు మేరకు ఫిబ్రవరి 24న పెద్ద సంఖ్యలో యువత అమృత్‌సర్‌ జిల్లాలోని అజ్‌నాలా పోలీస్‌స్టేషన్‌పై దాడికి తెగబడ్డారు. నిరసనకారులు బీభత్సం సృష్టించడంతో పోలీసులు మరో దారిలేక లవ్‌ప్రీత్‌ను విడిచిపెట్టాల్సి వచ్చింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీంతో అప్రమత్తమైన రాష్ట్ర యంత్రాంగం అల్లర్లు జరిగేలా యువతను రెచ్చగొట్టాడన్న ఆరోపణలపై అమృత్‌పాల్‌పై కేసు నమోదు చేసింది.

రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. ఆదివారం మధ్యాహ్నం వరకు ఇంటర్నెట్ సేవలు నిలిచి ఉంటాయని పోలీసులు చెప్పారు.

ప్రస్తుతం అమృత్‌పాల్ సింగ్‌ అనుచరుల్ని గుర్తు తెలియని ప్రదేశానికి తీసుకెళ్లి విచారిస్తున్నారు. అమృత్‌పాల్ సింగ్‌, అతడి అనుచరుల్ని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించారు.

ఎవరీ అమృత్‌పాల్‌ సింగ్‌..

ఇంజినీరింగ్‌ చదివిన 29 ఏళ్ల అమృత్‌పాల్‌ సింగ్‌ సిక్కులకు ప్రత్యేక దేశం కోరుతూ ఖలిస్థాన్‌ నినాదాలతో పంజాబ్‌ యువతను ప్రభావితం చేస్తున్నాడు.

2022 ఫిబ్రవరి వరకు అతడు ఎవరికీ తెలియని ఓ సాధారణ వ్యక్తి మాత్రమే. ఆధునిక జీవనశైలిని అనుసరిస్తూ కనీసం తలపాగా కూడా ధరించేవాడు కాదు.

తన బంధువుల రవాణా వ్యాపారంలో మద్దతుగా ఉండేందుకు దుబాయిలో నివశించాడు. సోషల్‌ మీడియాలో ఎక్కువ సమయం గడిపేవాడు.

కానీ, ‘వారిస్‌ పంజాబ్‌ దే’ సంస్థ వ్యవస్థాపకుడు, యాక్టర్‌ దీప్‌సిద్ధూ మరణంతో అమృత్‌పాల్‌ జీవితం ఒక్కసారిగా మారిపోయింది.

సిద్ధూ అనుచరులకు మార్గదర్శకాలు చేసేవారు కరవైపోయారు. దీనిని అమృత్‌పాల్‌ తెలివిగా వాడుకొన్నాడు. ‘వారిస్‌ పంజాబ్‌ దే’కు తానే నాయకుడినని ప్రకటించుకొన్నాడు.

తొలి రోజుల్లో సిద్ధూ కుటుంబీకులు ఇందుకు అంగీకరించలేదు. కానీ, అమృత్‌పాల్ మాత్రం పాపులర్‌ అయ్యాడు.

ఖలీస్థానీ కార్యకలాపాలకు అమృత్‌పాల్‌.. పంజాబ్‌నే స్థావరంగా ఎంచుకోవడంతో ఖలిస్థానీ సానుభూతిపరులను ఆకర్షించి నాయకుడయ్యాడు.