Prime Minister Modi: ఈడీ దెబ్బకు ప్రతిపక్షనాయకులంతా ఏకమయ్యారు.. ప్రధాని మోదీ

రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై జరిగిన చర్చకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లోక్‌‌సభ లో సమాధానమిచ్చారు.ప్రధాని తన ప్రసంగంలో ప్రతిపక్షాలకు అనేకసార్లు చురకలంటించారు.

  • Written By:
  • Publish Date - February 8, 2023 / 07:20 PM IST

Prime Minister Modi:రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై జరిగిన చర్చకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లోక్‌‌సభ లో సమాధానమిచ్చారు.

ప్రధాని తన ప్రసంగంలో ప్రతిపక్షాలకు అనేకసార్లు చురకలంటించారు.

రాష్ట్రపతి ప్రసంగం దేశ ప్రజలకు మార్గదర్శనం చేసిందని మోదీ చెప్పారు.

రాహుల్ గాంధీ పై మోదీ సెటైర్లు..(Prime Minister Modi)

నిన్న సభలో కొందరు నాయకులు చాలా ఉత్సాహంగా వ్యాఖ్యలు చేశారని, అది చూసి కొందరు నాయకులు థ్రిల్ అయ్యారని

మోదీ పరోక్షంగా రాహుల్ గాంధీపై సెటైర్ వేశారు. ఓ పెద్ద నాయకుడు రాష్ట్రపతిని విమర్శించారని,

నేతల వ్యాఖ్యలు వారి మనసులోని ద్వేషాన్ని బయటపెట్టాయని మోదీ చెప్పారు.

గతంలో తన సమస్యల పరిష్కారం కోసం భారత్ ఇతరులపైన ఆధారపడేదని, నేడు భారతే ఇతర సమస్యలను పరిష్కరిస్తోందన్నారు.

నేడు భారత్ జీ20 దేశాలకు నాయకత్వం వహిస్తోందని మోదీ చెప్పారు.

ఇది కొంతమందికి కంటగింపుగా ఉండొచ్చని, తనకైతే గర్వంగా ఉందని ప్రధాని చెప్పారు.

నిరాశలో దేశప్రగతిని అంగీకరించలేకపోతున్నారు.. (Prime Minister Modi)

నిరాశలో ఉన్న కొందరు దేశ ప్రగతిని అంగీకరించలేకపోతున్నారని ప్రతిపక్ష నేతలను మోదీ ఎద్దేవా చేశారు.

కొందరు నిరాశలో మునిగిపోయి దేశ విజయాలను సహించలేకపోతున్నారని మోదీ వ్యాఖ్యానించారు.

నేడు అనేక దేశాలను నిరుద్యోగం, ద్రవ్యోల్బణం వేధిస్తున్నాయని, భారత్ మాత్రం ఐదో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థగా నిలిచిందన్నారు.

భారత్‌లో ద్రవ్యోల్బణం అదుపులో ఉండటం చూసి కొందరు జీర్ణించుకోలేకపోతున్నారని మోదీ ప్రతిపక్షాలను చురకటించారు.

ఈడీకి ధన్యవాదాలు చెప్పాలి.. ప్రధాని మోదీ

దర్యాప్తు సంస్థలను విపక్షాలన్నీ కలిసి విమర్శలు చేస్తున్నాయని మోదీ సెటైర్ వేశారు.

ఈడీ దెబ్బకు ప్రతిపక్షనాయకులంతా ఏకతాటిపైకి వచ్చారన్నారు. ఈడీకి ధన్యవాదాలు చెప్పాల్సిందేనన్నారు.

తన జీవితాన్ని దేశం కోసం అంకితం చేశానని, ప్రజలకు తనపై విశ్వాసం ఉందని, అది విపక్షాలకు అందదని ప్రధాని చెప్పారు.

తాను 25 కోట్ల కుటుంబాల సభ్యుడినని మోదీ చెప్పారు. కొందరు ఒకే కుటుంబానికి సేవ చేశారని,

తాను 25 కోట్ల కుటుంబాలకు సేవ చేస్తున్నానని మోదీ చెప్పారు.

ఒకప్పుడు రైల్వే అంటే యాక్సిడెంట్లు గుర్తుకొచ్చేవని, నేడు వందే భారత్ రైళ్లు చూసి ప్రజలు గర్వపడుతున్నారని ప్రధాని చెప్పారు.

పదేళ్లు దేశంలో అవినీతి రాజ్యమేలింది..ప్రదాని మోదీ

2004 నుంచి 2014 వరకూ దేశంలో అవినీతి రాజ్యమేలిందని ప్రధాని ఆరోపించారు.

దేశంలో ఆ పదేళ్లు రక్తపుటేర్లు పారాయన్నారు. భారత్ తీవ్రంగా నష్టపోయిందని గతంలో కాంగ్రెస్‌ నేతృత్వంలో పాలించిన

యూపీఏ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

ఇదిలా ఉండగా మరోవైపు మోదీ ప్రసంగాన్ని ప్రతిపక్ష సభ్యులు అడ్డుకున్నారు. అదానీ వ్యవహారంపై జేపీసీ వేయాలన్న

డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకోకపోవడంతో బీఆర్ఎస్ సభ నుంచి వాకౌట్ చేసింది.

మరోవైపు మోదీ ప్రసంగంపై  రాహుల్‌ గాంధీ  స్పందించారు.

ప్రధానమంత్రి లోకసభలో చేసిన ప్రసంగం అసంతృప్తికి గురి చేసిందన్నారు.

ప్రధానమంత్రి అదానీ గ్రూపును రక్షించడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.

ప్రధాని తన ప్రసంగంలో ఎక్కడా అదానీ గ్రూపు విచారణ గురించి ప్రస్తావించలేదన్నారు.

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/