BRS MLC Kavitha : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, భారత జాగృతి అధ్యక్షురాలు కవిత ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద దీక్ష చేపట్టనున్న విషయం తెలిసిందే. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లను అమలు చేయాలని కోరుతూ ఆమె దీక్ష చేయనున్నారు. ఈ మేరకు ఈరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కవిత దీక్ష కొనసాగనుంది. కవిత దీక్షకు దేశ వ్యాప్తంగా 18 ప్రతిపక్ష పార్టీలు మద్దతు ప్రకటించాయి. ఈ మేరకు ఆయా పార్టీల ప్రతినిధులు కవితతో పాటు దీక్షలో కూర్చోనున్నారు. పలు మహిళా హక్కుల సంఘాలు కూడా కవిత దీక్షకు సంఘీభావం ప్రకటించాయి. ఈ నేపథ్యంలో కవితకు మద్ధతుగా తెలంగాణ మహిళా మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్‌లు ఇప్పటికే డిల్లీకి చేరుకున్నారు. ఎమ్మెల్సీ కవితతోపాటు ఈ దీక్షలో 500 మంది కూర్చోనున్నారు.
కవిత (BRS MLC Kavitha) దీక్ష ప్రారంభించనున్న సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి..
మరొకసేపట్లో ప్రారంభం కంబున్న ఈ దీక్షను ఉదయం 10 గంటలకు సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ప్రారంభించనున్నారు. అలానే సాయంత్రం 4 గంటలకు సీపీఐ కార్యదర్శి డి.రాజా దీక్షను ముగించనున్నారు. కాగా.. గురువారం నాడు జంతర్ మంతర్ వద్ద దీక్ష వేదికకు సంబంధించి పలు షరతులు విధిస్తూ ఢిల్లీ పోలీసులు కవిత సిబ్బందికి సూచించారు. అందుకు గాను నిన్న కవిత ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతున్న సమయంలోనే పోలీసులు ఈ విషయంపై కవితకు పేపర్ మీద రాసి సమాచారం చేరవేశారు. దీనిపై స్పందించిన కవిత.. తాము ముందుగానే దీక్షకు అనుమతి తీసుకున్నామని చెప్పారు. ముందు అనుమతి ఇచ్చి.. ఇప్పుడు ఈ విధంగా ఎలా చేస్తారని ప్రశ్నించారు. తమ దీక్షలో ఎలాంటి మార్పు లేదని.. జంతర్ మంతర్ వద్ద దీక్షను కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
మీడియా సమావేశం అనంతరం కవిత నేరుగా జంతర్ మంతర్ వద్దకు వెళ్లారు. అక్కడ దీక్షకు సంబంధించి ఏర్పాట్లను పరిశీలించారు. జంతర్ మంతర్ వద్ద కవిత మీడియాతో మాట్లాడుతూ.. 5 వేల మంది వస్తారని చెప్పి.. 10 రోజుల కిందటే పర్మిషన్ కోసం ఆప్లికేషన్ పెట్టుకోవడం జరిగిందన్నారు. అందుకు అనుమతి కూడా ఇచ్చారని చెప్పారు. కానీ ఇప్పుడు ఇక్కడే బీజేపీ వాళ్లది కూడా ధర్నా ఉందని చెబుతున్నారని తెలిపారు. తమ వాళ్లు పోలీసులు ఉన్నతాధికారులతో మాట్లాడుతున్నారని చెప్పారు. ముందుగా ఇచ్చిన పర్మిషన్ మేరకు తమ కార్యక్రమం నిర్వహించుకునేలా చూడాలని కోరారు. పర్మిషన్ వచ్చిన వెంటనే పనులు ప్రారంభించుకోవాల్సి ఉందని తెలిపారు. ఇప్పటికే పనులు ప్రారంభం కావాల్సి ఉందని అన్నారు. అయితే కొంత ఇబ్బందులకు గురి చేస్తున్నట్టుగా అనిపిస్తుందని చెప్పారు.
కాగా మరోవైపు అటు లిక్కర్‌స్కామ్‌కు వ్యతిరేకంగా బీజేపీ కూడా ధర్నా చేపడుతుంది. మొదటగా ఈ ధర్నాను జంతర్‌మంతర్ వద్ద చేయనున్నట్లు వెల్లడించారు. కాగా జంతర్‌మంతర్ వేదిక వద్ద నుంచి తాము దీక్షను ఉపసంహరించుకుని మరోచోటికి మార్చుకుంటున్నట్లు బీజేపీ తెలిపింది. ఈ మేరకు దీన్ దయాళ్ మార్గ్‌లోని ఆంధ్ర స్కూల్ వద్ద బీజేపీ ధర్నా చేయనున్నారు. ఈ పోటాపోటి ధర్నాలతో డిల్లీలో రాజకీయం వేడెక్కుతుంది.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/