Site icon Prime9

PAN Card: డిజిట‌ల్ లావాదేవీలన్నీ పాన్‌ కార్డు తోనే.. ఆర్థిక మంత్రి కీలక ప్రకటన

Pan card

Pan card

PAN Card: నేడు ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ లో ఆర్ధికశాఖ మంత్రి.. నిర్మల సీతారామన్ కీలక ప్రకటన చేశారు. డిజిటల్ లావాదేవీలకు.. పాన్ కార్డును సాధారణ గుర్తింపు కార్డుగా పరిగణించనున్నట్లు తెలిపారు.

ఇక నుంచి ప్రభుత్వ ఏజెన్సీల అన్ని డిజిటల్ సిస్టమ్‌లకు గుర్తింపు కార్డుగా పాన్ కార్డును ఉపయోగించుకునేలా జరుగుతుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. పార్లమెంట్‌లో వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆమె.. పాన్‌కార్డుపై కీలక నిర్ణయాన్ని వెల్లడించారు. ఈ నిర్ణయంతో.. పన్ను నిర్వహణ.. పరిశ్రమల వ్యాపారాన్ని సులభతరం చేయడానిక సహాయపడుతుందని అన్నారు.

కాగా.. ఈ బడ్జెట్‌లో బిజినెస్‌ అనుమతులు, వివిధ కార్యకలాపాల కోసం విధించిన నిబంధనలను సడలిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అలాగే వాటి స్థానంలో నూతన నిబంధనలను తీసుకువచ్చారు. ఈ మేరకు పాన్ నంబర్ ను సింగిల్‌ బిజినెస్‌ ఐడీగా చట్టబద్దం చేస్తామని ఆర్ధిక మంత్రి స్పష్టం చేశారు.

జాతీయ, అంతర్జాతీయంగా వ్యాపార కార్యకలాపాలు నిర్వహించేందుకు కేంద్ర, రాష్ట్రం లోని వివిధ శాఖల నుండి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది.

దీనికోసం ఇతర డాక్యుమెంట్లను అందజేయాల్సి ఉంటుంది.

ఈ నేపథ్యంలో.. ఏదైనా సంస్థను గుర్తించాలంటే పాన్‌ కార్డ్ ఒక్కటి ఉంటే సరిపోయేలా నూతన విధానాలను తీసుకువచ్చింది.

ఈ నిర్ణయంతో పాన్‌కార్డ్ తోనే అన్ని రకాల వ్యాపార అనుమతులు తీసుకొని కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చు.

ప్రస్తుతం దేశంలో.. వివిధ పనుల కోసం పాన్‌కార్డు (PAN Card) తో వివిధ ఐడీలను ఉపయోగించుకోవాల్సి వస్తుంది.

ఈపీఎఫ్ఓ, జీఎస్‌టీఎన్‌, ఈఎస్‌ఐసీ వంటి 20 రకాల ఐడీలను పలు సందర్భాల్లో ఉపయోగించుకోవాల్సి వస్తుంది.

ఇలాంటి వాటికోసం ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పద్దతికి ఎక్కువ సమయంతో పాటు.. అధికంగా శ్రమపడాల్సి వస్తుందని కేంద్రం భావించింది.

దీంతో ఈ విధానాన్ని రద్దు చేస్తు కేంద్రం నిర్ణయం తీసుకుంది. మీరు ఏదైనా వ్యాపారం ప్రారంభించాలనుకుంటే ఒక్క పాన్‌ కార్డుతో మీ పని సులభతరం అవుతుంది.

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

Exit mobile version