Site icon Prime9

Akshaya Tritiya Celebrations: దేశవ్యాప్తంగా అక్షయ తృతీయ సంబరాలు

Akshaya Tritiya

Akshaya Tritiya

Akshaya Tritiya Celebrations: అక్షయ తృతీయ సందర్భంగా దేశవ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి. శుక్రవారం అయోధ్యలో భక్తులు సరయూ నదిలో పుణ్య స్నానాలు ఆచరించారు. కాగా దేశంలోని హిందువులు, జైనులు అక్షయ తృతీయ రోజును అత్యంత పవిత్ర దినంగా భావిస్తున్నారు. అక్షయ తృతీయ సందర్బంగా బంగారం కొంటే అదృష్ట కలిసి వస్తుందని నమ్మకం భారతీయుల్లో ఉంటుంది.

బంగారం, భూమిపై పెట్టుబడులు.. (Akshaya Tritiya Celebrations)

ఇదే రోజు దానధర్మాలు చేసినా.. లేక కొత్త వ్యాపారాలు ప్రారంభించినా.. కొత్త పెట్టుబడుల పెట్టినా…లేదా బంగారంతో పాటు రియల్‌ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టినా కలిసి వస్తుందన్న నమ్మకం మన దేశ ప్రజల్లో ఉంది. సంస్కృతంలో అక్షయ అంటే .. ఎప్పుడు వెనక్కి తగ్గేది లేదు అని.. కాగా అక్షయ తృతీయ రోజు కొత్త పని ప్రారంభిస్తే అడ్డంకులు సమసిపోతాయన్న నమ్మకం.. అదృష్టం కలిసి వస్తుందని మన దేశంలో చాలా మంది బంగారం.. కానీ, రియల్‌ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెట్టడం జరుగుతోంది.

ఇక అక్షయ తృతీయ విషయానికి వస్తే వైశాఖ మాసంలో శుక్ల పక్షం మూడో రోజు జరుపుకుంటారని గ్రిగోరియన్‌ కేలండర్‌ ద్వారా తెలుస్తుంది. సాధారణంగా అక్షయ తృతీయ ఏప్రిల్‌ – మే నెలలో వస్తుంటుంది. ఇదే రోజు సూర్యుడు, చంద్రుడు ఒకే కక్షలోకి వస్తారని భావిస్తుంటారు. ఈ ఏడాది మే 10వ తేదీన అక్షయ తృతీయ జరుపుకుంటున్నారు. కాగా ఈ రోజు ఇంటికి మెటల్‌ వస్తువులు అంటే బంగారం కానీ… వెండి కానీ కొనుగోలు చేస్తే.. బాగా కలిసి వస్తుందన్న నమ్మకం. అయితే ఇక్కడ ఆసక్తి కలిగించే అంశం అక్షయ తృతీయ రోజును పరుశురాముడి జన్మదినంగా చెప్పుకుంటారు. హిందూ గ్రంథాల ప్రకారం చూస్తే అక్షయతృతీయ సందర్భంగా కలియుగం ప్రారంభంమై ద్వాపరం యుగం ముగుస్తుందని చెబుతారు. ఈ రోజు చాలా మంది ఉపవాసం ఉంటారు. భక్తులు విష్ణు భగవాడుని పూజిస్తారు. బియ్యం, పసుపు, కుంకుమతో కలిపి అక్షితలు తయారు చేసి నైవేద్యంలో ప్రధానంగా పాలు, పాల ఉత్పత్తులతో స్వీట్స్‌ తయారు చేసి విష్ణు దేవుడికి నైవేద్యం పెడతారు

Exit mobile version