Site icon Prime9

AI News Anchor: అమ్మాయి అనుకుంటే పొరపాటే.. మీడియాలో ఏఐ న్యూస్ యాంకర్ లిసా

AI news Anchor in odisha

AI news Anchor in odisha

AI News Anchor: ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచాన్ని ఏలుతుందని చెప్పాలి. ప్రతి రంగంలోనూ ఏఐ ద్వారా సేవలను మరింత విస్తృతం చేస్తున్నారు. తక్కువ కాలంలో ఆక్యురేట్ సమాచారాన్ని అందించండంలో ఏఐ తనదైన పాత్ర పోషిస్తుంది. కాగా ఇప్పుడు ఈ ఏఐ సేవలు మీడియా రంగంలోనూ మొదలయ్యాయి. మొన్నటి వరకూ ఇది విదేశాల్లోనూ ఉంది అనుకుంటుండడగా ఇప్పుడు ఈ సేవలు ఇండియాలో మొదలయ్యాయి. ఒడిశాలోని ఒక ప్రైవేట్ న్యూస్ ఛానెల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ వర్చువల్ న్యూస్ యాంకర్ ‘లిసా’ను ఆవిష్కరించింది. కంప్యూటర్‌ సాయంతో రూపొందించిన ఈ మోడల్ న్యూస్ యాంకర్.. ఒడిశా సంప్రదాయ చేనేత చీరను ధరించి కనిపించింది అచ్చం అమ్మాయిలా కనిపిస్తుంది. OTV నెట్‌వర్క్ టెలివిజన్ అండ్ డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో ఒడియా, ఇంగ్లీష్ రెండింటిలోనూ వార్తలను అందించడానికి లిసా ప్రోగ్రామ్ చేయబడిందని ఆ మీడియా కంపెనీ ప్రకటించింది.

లిసా అనేక భాషలు మాట్లాడగల సామర్థ్యం ఉన్నప్పటికీ, ఆమె ప్రస్తుతం ఒడియా, ఇంగ్లీష్ వార్తలనే అందిస్తుందని కంపెనీ వెల్లడించింది. ఒడియా టెలివిజన్ జర్నలిజంలో కృత్రిమ మేధస్సు సాంకేతికతను స్వీకరించడంలో లిసా పరిచయం అనేది ఓ మైలురాయిని పలువురు ప్రశంసిస్తున్నారు.

లిసాకు ఫాలోయింగ్ మాములుగా లేదు(AI News Anchor)

“రాబోయే రోజుల్లో లిసాను ఒడియా మీడియాలో మరింత ఇన్వాల్వ్ చేసేలా ప్రయత్నాలు జరుగుతున్నాయని.. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ వంటి అన్ని ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలోనూ లిసాను చూడవచ్చు, ఫాలో కావచ్చు”అని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది.

ఏఐ న్యూస్ యాంకర్లు భావోద్వేగాలతో కూడిన ముఖకవలికలతో ప్రసంగం ఇవ్వగలుగుతారు. కంప్యూటర్-సృష్టించిన ఈ మోడల్స్ సరైన ఖచ్చితత్వంతో పాటు వార్తా కథనాలను అందించగలుగుతాయి. కొంతమంది ఏఐ న్యూస్ యాంకర్లు వీక్షకుల ప్రశ్నలకు లైవ్ లో సమాధానం కూడా ఇవ్వగలుగుతాయి. AI న్యూస్ యాంకర్లు.. వార్తల పంపిణీ విధానంలో విప్లవాత్మక మార్పులు అని నిపుణులు భావిస్తున్నారు. ఏఐ న్యూస్ ప్రెజెంటర్లు బ్రేకింగ్ న్యూస్, 24/7 కవరేజీని అందించగలరు. అయినప్పటికీ, వారి ద్వారా కూడా అనేక సమస్యలు తలెత్తే అవకాశం ఉందని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Exit mobile version