Site icon Prime9

Amit Shah’s warning: అమిత్ షా హెచ్చరికతో మణిపూర్‌లో దోచుకున్న 140 రైఫిళ్లు, మెషిన్ గన్లు అప్పగింత

Amit Shah

Amit Shah

Amit Shah’s warning: మణిపూర్‌లో దోచుకున్న ఆయుధాలను తిరిగి ఇవ్వమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రజలను హెచ్చరించిన తరువాత, శుక్రవారం 140కి పైగా ఆయుధాలు పోలీసులకు అప్పగించారు.  ఆయుధాల కోసం త్వరలో కూంబింగ్ ఆపరేషన్ ప్రారంభిస్తామని, ఎవరైనా అక్రమ ఆయుధాలు కలిగి ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని అమిత్ షా హెచ్చరించారు.

అతని హెచ్చరిక తర్వాత, సెల్ఫ్ లోడింగ్ రైఫిల్ (SLR), R 29, కార్బైన్, AK-47, INSAS రైఫిల్ మరియు INSAS లైట్ మెషిన్ గన్ (LMG)తో సహా 140 పైగా ఆయుధాలను పోలీసులకు అప్పగించారు. మణిపూర్‌లో పరిస్థితిని సమీక్షించడానికి అమిత్ షా నాలుగు రోజులు పర్యటించారు. తన పర్యటన సందర్భంగా, ఈశాన్య రాష్ట్రంలో హింసాత్మక ఘటనలపై ప్రత్యేక సీబీఐ బృందం దర్యాప్తును పర్యవేక్షించేందుకు రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలోని కమిటీతో సహా పలు చర్యలను ఆయన ప్రకటించారు.

98 మంది మృతి..  300 మందికి గాయాలు.. (Amit Shah’s warning)

మైటీస్ డిమాండ్‌కు వ్యతిరేకంగా ఆల్ ట్రైబల్ స్టూడెంట్ యూనియన్ మణిపూర్ (ATSUM) నిర్వహించిన గిరిజన సంఘీభావ యాత్ర తర్వాత ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్‌లో చెలరేగిన జాతి హింసలో కనీసం 98 మంది మరణించగా 300 మందికి పైగా గాయపడ్డారు. దాదాపు నెల రోజుల పాటు సాగిన హింసతో వేలాది మందిని నిరాశ్రయులయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా 272 సహాయ శిబిరాల్లో ప్రస్తుతం 37,450 మంది ఉన్నారు. మరోవైపు హింస చెలరేగడంతో విధించిన కర్ఫ్యూ అనేక జిల్లాల్లో పాక్షికంగా ఎత్తివేయబడింది. ఇంఫాల్ వెస్ట్, ఇంఫాల్ ఈస్ట్ మరియు బిష్ణుపూర్ వంటి నిర్దిష్ట ప్రాంతాలలో, కర్ఫ్యూను 12 గంటల పాటు సడలించారు.

Exit mobile version