Abhishek Banerjee: తాను అవినీతికి పాల్పడినట్లు రుజువైతే సీబీఐకి దమ్ముంటే తనను అరెస్టు చేయాలని టీఎంసీ నేత అభిషేక్ బెనర్జీ శుక్రవారం సవాల్ చేసారు. స్కూల్ ఉద్యోగాల కుంభకోణంపై విచారణలో భాగంగా శనివారం కోల్‌కతా కార్యాలయంలో హాజరుకావాలని సీబీఐ పిలుపునిచ్చిన నేపధ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం.
అభిషేక్ బెనర్జీ పిటిషన్ ను కొట్టేసిన హైకోర్టు..( Abhishek Banerjee)
ప్రస్తుతం ప్రజాప్రచారంలో ఉన్న అభిషేక్ బెనర్జీ, విచారణకు హాజరయేందుకు దానిని తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయించుకున్నారు. తాను నేటి రాత్రికి కోల్ కతా నగరానికి వస్తున్నట్లు అయన చెప్పారు. ఇక్కడి నిజాం ప్యాలెస్‌లోని కార్యాలయాల్లో విచారణలో పాల్గొనాల్సిందిగా బెనర్జీకి సమాచారం పంపినట్లు అధికారులు తెలిపారు. గురువారం, కలకత్తా హైకోర్టు ఉపాధ్యాయ నియామక స్కామ్‌లో సీబీఐ మరియు ఈడీ వంటి దర్యాప్తు సంస్థలు తనను విచారించవచ్చని గతంలో కోర్టు ఇచ్చిన ఆదేశాలను రీకాల్ చేయాలని బెనర్జీ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది.
కలకత్తా హైకోర్టు నిర్ణయం వెలువడిన తర్వాత అభిషేక్ గురువారం విలేకరులతో మాట్లాడుతూ న్యాయవ్యవస్థ మరియు కోర్టు పట్ల నాకు పూర్తి గౌరవం ఉంది.దర్యాప్తు సంస్థలకు సహకరించడంలో నాకు ఎలాంటి సమస్య లేదు. ఇంతకుముందు కూడా, కేంద్ర ఏజెన్సీలు నన్ను పిలిచినప్పుడల్లా నేను నా పూర్తి సహకారాన్ని అందించాను అంటూ అభిషేక్ బెనర్జీ చెప్పారు. ఈ కుంభకోణంలో నిందితుడైన కుంతల్ ఘోష్ దాఖలు చేసిన ఫిర్యాదులో టీఎంసీ నేత పేరు ప్రస్తావనకు వచ్చింది. పాఠశాల కుంభకోణం కేసులో అభిషేక్ బెనర్జీ పేరు చెప్పాలని కేంద్ర దర్యాప్తు సంస్థలు తనపై ఒత్తిడి తెస్తున్నాయని ఘోష్ ఆరోపించారు.పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేటి సాయంత్రం బంకురాలో ర్యాలీని ఉద్దేశించి ప్రసంగిస్తారు, దీనిని ముందుగా టిఎంసి అధినేత మేనల్లుడు కూడా అభిషేక్ ప్రసంగించాల్సి ఉంది.