Site icon Prime9

AAP MP Raghav Chadha: సీఎం కేజ్రీవాల్ ను పరామర్శించిన ఆప్ ఎంపీ రాఘవ్‌ చద్దా

Raghav Chadha

Raghav Chadha

AAP MP Raghav Chadha:ఆమ్‌ ఆద్మీపార్టీ రాజ్యసభ సభ్యుడు రాఘవ్‌ చద్దా బ్రిటన్‌ నుంచి ఢిల్లీ చేరుకున్నారు. వెంటనే ఆప్‌ చీఫ్‌ కేజ్రీవాల్‌ ఇంటికి పరామర్శించడానికి వచ్చారు. కాగా కంటి చికిత్స కోసం ఆయన లండన్ వెళ్లారు దీర్ఘకాలం పాటు అక్కడే ఉన్నారు. కేజ్రీవాల్‌ జైలుకు వెళ్లిన తర్వాత ఒక వైపు స్వాతి మలీవాల్‌ అమెరికాకు వెళ్లిపోగా.. చద్దా లండన్‌కు వెళ్లిపోయారు. ఆయనకు సంఘీభావం తెలుపకుండా తప్పించుకునేందుకు విదేశాల్లో గడిపారన్న టాక్‌ ఢిల్లీ పొలిటికల్‌ సర్కిల్స్‌ లో చక్కర్లు కొడుతోంది. ఇటీవల కాలంలో చద్దా గురించి పార్టీ నాయకులు పదే పదే అడిగినా.. ఆప్‌ మంత్రి సౌరభ్‌ భరద్వాజ్‌ ఎట్టకేలకు స్పందించారు. చద్దా కంటి ఆపరేషన్‌ కోసం లండన్‌ వెళ్లారు. సర్జరీ అత్యంత క్రిటికల్‌ కంటి చూపు కూడా కోల్పేయే ప్రమాదం కూడా ఉందని కాస్తా వ్యంగ్యంగా అన్నారు.

లోకసభ ఎన్నికల ప్రచారంలో..(AAP MP Raghav Chadha)

ఇదిలా ఉండగా స్వాతి మలీవాల్‌ కేజ్రీవాల్‌ ఇంటికి పరామర్శించడానికి వెళ్లినప్పుడు ఆయన వ్యక్తిగత కార్యదర్శి భైబవ్‌కుమార్‌ స్వాతిపై దాడి చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రాజధాని ఢిల్లీలో ఇది హాట్‌ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం రాఘవ్‌ చద్దా కేజ్రీవాల్‌ ఇంటికి రావడం పెద్ద చర్చనీయాంశంగా మారింది. స్వాతి మాదిరిగానే ఆయనపై కూడా దాడి జరుగుతుందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.అయితే పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌మాన్, ఆప్‌ వర్గాలు కూడా చద్దా కంటి ఆపరేషన్‌ చేసుకొని వచ్చారు కాబట్టి.. ప్రస్తుతం జరుగుతున్న లోకసభ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని చెప్పారు. అలాగే పంజాబ్‌లో జరిగే శాసనసభ ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొంటారని మాన్‌ తెలిపారు. ఇక చద్దా విషయానికి వస్తే ఆయన పంజాబ్‌ కోటా నుంచి రాజ్యసభకు ఎన్నికైనారు. ఇదిలా ఉండగా మాన్‌ ఆప్‌ పార్టీ గురించి మాట్లాడుతూ.. సంస్థాగతంగా పార్టీ బలంగా ఉందన్నారు. పార్టీ అధిష్టాన వర్గం ఏ బాధ్యత అప్పగించినా.. శిరసావహించాల్సిందేన్నారు. జూన్‌ 4న ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ఆప్‌పార్టీ రాజకీయంగా మరింత బలపడుతుందని మాన్‌ ధీమా వ్యక్తం చేశారు.

Exit mobile version