Khadi Scam: ఢిల్లీ ఎల్‌జీ వీకే సక్సేనా 2016లో కెవిఐసి ఛైర్మన్ గా ఉన్నపుడు రూ. 1400 కోట్ల విలువైన నోట్లను మార్చుకోవాలని తన ఉద్యోగులపై ఒత్తిడి తెచ్చారని ఆప్ ఎమ్మెల్యే దురేగేశ్ పాఠక్ సోమవారం ఆరోపించారు. అతను కెవిఐసి ఛైర్మన్‌గా ఉన్నప్పుడు, నోట్ల రద్దు జరిగింది, అక్కడ పని చేస్తున్న క్యాషియర్ తాను బలవంతంగా నోట్ల మార్పిడికి పాల్పడ్డానని లిఖితపూర్వకంగా తెలిపాడు అతనిని సస్పెండ్ చేయడం దురదృష్టకరం. అయితే దీనిపై విచారణ జరగాలని మేము కోరుకుంటున్నామని పాఠక్ చెప్పారు.
ఒక్క ఢిల్లీ బ్రాంచ్‌లోనే రూ. 22 లక్షల మార్పిడి జరిగింది. దేశవ్యాప్తంగా అలాంటి శాఖలు 7000 ఉన్నాయి, అంటే రూ. 1400 కోట్ల కుంభకోణం జరిగిందని పాఠక్ చెప్పారు. ఈ వ్యవహారంపై సీబీఐ, ఈడీ విచారణ జరిపించాలని ఆప్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తూ ఆయన రాజీనామా చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ కాంప్లెక్స్‌లోని గాంధీ విగ్రహం వద్ద ఎల్‌జీ వీకే సక్సేనా చోర్ హై, వీకే సక్సేనా కో అరెస్ట్ కరో అంటూ ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు.ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ పదవి నుంచి సక్సేనాను తొలగించాలని డిమాండ్ చేశారు.
ఎల్జీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, ప్లకార్డులు పట్టుకుని ఆప్ ఎమ్మెల్యేలు సభ వెల్ లోకి రావడంతో డిప్యూటీ స్పీకర్ రాఖీ బిర్లా సభా కార్యక్రమాలను 15 నిమిషాల పాటు నిలిపివేశారు.