Site icon Prime9

Sukesh Chandrashekhar: ఆప్ నేతలు గోవా, పంజాబ్ ఎన్నికల కోసం డబ్బు అడిగారు.. సుకేష్ చంద్రశేఖర్ మరో లేఖ

AAP

AAP

Delhi: ఆమ్ ఆద్మీ పార్టీకి రూ. 500 కోట్లు విరాళంగా ఇవ్వాలని బలవంతం చేసినట్లు సుకేష్ చంద్రశేఖర్ ఆరో్పించారు. జైల్లో ఉన్న ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్ గోవా, పంజాబ్ ఎన్నికల కోసం ఆప్‌కి డబ్బు చెల్లించాలని తనను కోరారని ఆరోపిస్తూ ఆయన మరో లేఖ రాసారు. రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసులో చంద్రశేఖర్ దేశ రాజధానిలోని మండోలి జైలులో ఉన్నారు. ఇదే విషయం పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ను నిందితురాలిగా పేర్కొంది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఆప్ నేతలు డ్రామాలు ఆపాలని చంద్రశేఖర్ కోరారు. ఢిల్లీ ఎంసీడీ ఎన్నికలకు ముందు బీజేపీ ఆదేశానుసారం తాను వారి ప్రతిష్టను దిగజార్చేందుకు ప్రయత్నిస్తున్నారనే ఆప్ ఆరోపణలను ఆయన తోసి పుచ్చారు.

మరోవైపు సుకేష్ చంద్రశేఖర్‌ ఆరోపణల పై సీబీఐ విచారణ జరిపించాలని ఢిల్లీ బీజేపీ డిమాండ్‌ చేసింది. జైలులో ఉన్న ఆప్ మంత్రి సత్యేందర్ జైన్‌ను రాజధాని నుంచి ఉత్తరప్రదేశ్ లేదా హర్యానాలోని జైలుకు తరలించాలని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఆదేశ్ గుప్తా డిమాండ్ చేశారు.జైల్లో రక్షణ కోసం కేజ్రీవాల్ ప్రభుత్వంలో అప్పటి జైలు మంత్రి జైన్‌కి రూ. 10 కోట్లు చెల్లించినట్లు అతను పేర్కొన్నాడు. రాజ్యసభ సీటు కోసం రూ. 50 కోట్లు చెల్లించినట్లు కూడా చెప్పాడు. ఈ ఆరోపణలు సీబీఐ విచారణకు అర్హమైనవి. వీటిపై తాము త్వరలో లెఫ్టినెంట్ గవర్నర్ వికె సక్సేనాను కలుస్తామని ఆయన చెప్పారు.

సుకేష్ చంద్రశేఖర్ నాలుగు లేఖలలో ఒకదానిలో, తాను ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను కలిశానని అన్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీ విస్తరణకు రూ. 500 కోట్లు ఏర్పాటు చేయాలని తనను కోరారని ఆరోపించారు. మాజీ డీజీపీ (జైలు) సందీప్ గోయల్‌కు చెల్లించిన చెల్లింపు వివరాలను కూడా ఆయన తెలిపారు.

Exit mobile version