Site icon Prime9

Uttar pradesh: కూతురు మానసిక అనారోగ్యంతో ఉందని 36 ఏళ్లపాటు గదిలో బంధించిన తండ్రి

uttar prasesh

uttar prasesh

Uttar Pradesh:  ఉత్తరప్రదేశ్ కు చెందిన సప్నా జైన్ (53)అనే మహిళను గత 36 ఏళ్లుగా ఆమె తండ్రి చీకటి గదిలో బంధించాడు. ఆమెకు మానసిక అనారోగ్యం పేరిట ఇలా బంధించి స్నానం’ చేయగలిగేలా నీరు ఆమెపైకి విసిరి, తలుపు క్రింద నుండి ఆహారం ఆమెకు పంపించేవాడు.

హత్రాస్‌కు చెందిన బిజెపి ఎమ్మెల్యే అంజులా మహౌర్‌కు స్థానిక ఎన్‌జిఓ సేవా భారతి సభ్యులు సప్నా దుస్థితి గురించి తెలియజేశారు. దీనితో ఆమె మహిళను రక్షించడానికి రంగంలోకి దిగారు. సప్నా తండ్రి గిరీష్ చంద్ ఇటీవల మరణించడంతో పరిస్థితిని పరిశీలించడానికి సేవా భారతి నుండి మహిళల బృందం వెళ్ళింది.సేవా భారతి సీనియర్ సభ్యురాలు నిర్మలా సింగ్ మాట్లాడుతూ మేము ఆమెను చాలా దారుణస్దితిలో కనుగొన్నాము. ఆమె ఒళ్లంతా మురికిగా ఉంది. మురికి బట్టలు వేసుకుందని తెలిపారు. ఎన్జీవో సభ్యులు ఆమెకు స్నానం చేయించి కొన్ని శుభ్రమైన బట్టలు తెచ్చి వేసారు.ఎమ్మెల్యే, సప్నా కుటుంబ సభ్యులతో మాట్లాడి ఆమెను ఆగ్రాలోని మానసిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు.

దీనిపై ఎమ్మెల్యే అంజులా మౌహర్ మాట్లాడుతూ సప్నా మైనర్‌గా జైలు పాలైంది. ఆమె తన జీవితంలో ఎక్కువ భాగం మురికిగా ఉండే గదిలో బంధించబడింది. 17 ఏళ్ల వరకూ ఆమె బయటి ప్రపంచాన్ని చూడలేదు. దీని గురించి విన్న తర్వాత నేను ఏదో ఒకటి చేయాలని నిర్ణయించుకున్నానని అన్నారు.ఆమెను పరీక్షించిన వైద్యుడు జ్ఞానేంద్ర సింగ్ ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని త్వరలో కోలుకుంటుందని ఆశిస్తున్నామని అన్నారు.

Exit mobile version