Site icon Prime9

Indigo Flight: తప్పిన పెను ప్రమాదం.. ఇండిగో విమానంలో మంటలు

indigo flight accident in delhi

indigo flight accident in delhi

Indigo Flight: ఒక్కో సారి విమానంలో ఏర్పడే టెక్నికల్ సమస్యల వల్ల లేదా మరే ఏ ఇతర కారణాల వల్ల అయిన కొన్ని సార్లు ఎయిరోప్లెయిన్ లలో ప్రమాదాలు జరుగుతుంటాయి. ఇలాంటి ఘటనే ఒకటి నిన్నరాత్రి డిల్లీలో చోటుచేసుకుంది. ఢిల్లీ నుంచి బెంగళూరు వెళ్తున్న విమానంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. టేకాఫ్ సమయంలో ఇంజిన్‌లో ఈ మంటలు చెలరేగాయి.

ఢిల్లీ నుంచి బెంగళూరు వెళ్తున్న ఇండిగో విమానంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఫ్లైట్ టేకాఫ్ సమయంలో ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. మంటలను గుర్తించిన పైలట్ ఎయిర్‌పోర్ట్ అధికారులకు సమాచారమిచ్చారు. అత్యవసర ల్యాండింగ్‌కు అధికారులు వెంటనే అనుమతిచ్చారు. ప్రమాద సమయంలో విమానంలో 184 మంది ప్రయాణికులు ఉన్నారని అధికారులు వెల్లడించారు. వారంతా పైలట్అ ప్రమత్తతతో ప్రయాణికులు క్షేమంగా ఉన్నారు. వారందరినీ మరో విమానం ద్వారా అధికారులు తరలించారు. నిన్నరాత్రి ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో ఈ ఘటన చోటు చేసుకున్నట్టు అక్కడి అధికారులు పేర్కొన్నారు.

ఇదీ చదవండి: ఎమ్మెల్యేల కొనుగళ్ల డీల్.. ముగ్గురు నిందితులు హైదరాబాద్‌ విడిచి వెళ్లొద్దు.. హైకోర్టు

Exit mobile version