Site icon Prime9

Uttar Pradesh: లక్నోలో కుప్పకూలిన గోడ, 9 మంది దుర్మరణం

wall-collapsed-lucknow

Lucknow: ఉత్తర్ ప్రదేశ్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. లక్నోలోని దిల్‌కుషా ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఓ ఇంటి గోడ కూలిన ఘటనలో తొమ్మిది మంది దుర్మరణం చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు ప్రయత్నించారు.

ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. గోడ శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడేందుకు స్థానికుల సాయంతో సహాయక చర్యలు చేపట్టారు. తీవ్రంగా గాయపడిన వారికి ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి పంపించారు.

యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ ఘటన పై స్పందించారు. ఈ ప్రమాదం జరగడం విచారకరమని అన్నారు. మృతల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదం పై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున 4 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. అంతేకాకుండా క్షతగాత్రులకు ఉచిత వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

Exit mobile version