Site icon Prime9

Vande Bharat trains: వచ్చే ఏడాది ఆగస్టు 15 నాటికి 75 వందేభారత్ రైళ్లు

vande bharath

vande bharath

New Delhi: వచ్చే ఏడాది ఆగస్టు 15 నాటికి 75 కొత్త వందేభారత్ రైళ్లను నడపాలని భారతీయ రైల్వే లక్ష్యంగా పెట్టుకుంది. అందువల్ల ప్రతినెలా ఏడెనిమిది రైళ్లు సిద్ధంగా ఉండాలన్నది రైల్వే లక్ష్యం కావడంతో ఈ రైళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేశారు. అయితే వేగం చూస్తుంటే రైళ్ల రాకపోకలు ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది.

రైల్వే వర్గాల సమాచారం మేరకు ప్రతి కొత్త వందే భారత్ రైలులో కొన్ని కొత్త సాంకేతికత మరియు అప్‌గ్రేడేషన్ జరుగుతోంది. దీని కారణంగా క్రమంగా ఖర్చు కూడా పెరుగుతోంది. 16 కోచ్‌ల వందే భారత్ రైలు నిర్మాణ వ్యయం దాదాపు రూ. 110-రూ. 120 కోట్లకు చేరుకోగా, దీనిని 106 కోట్ల రూపాయలతో ప్రారంభించారు. ఐసిఎఫ్ ప్రతి నెలా దాదాపు 10 రైళ్లను తయారు చేయాలని యోచిస్తోంది.

కపుర్తలాలోని రైల్ కోచ్ ఫ్యాక్టరీ మరియు రాయ్ బరేలీలోని మోడ్రన్ కోచ్ ఫ్యాక్టరీ కూడా రాబోయే 3 సంవత్సరాలలో 400 వందే భారత్ రైళ్ల లక్ష్యాన్ని చేరుకోవడానికి కోచ్‌ల తయారీని ప్రారంభించనున్నాయి. మేక్ ఇన్ ఇండియా తరహాలో వందేభారత్‌ను రూపొందించాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే కోట్లాది రూపాయల పెట్టుబడి పెట్టినా వందేభారత్‌కు ఇంకా ఆశించిన మేర పనిజరగలేదు. పలుమార్లు టెండర్ల ప్రక్రియ నిలిచిపోయిందని చెబుతున్నారు.

Exit mobile version