Site icon Prime9

Ganesh Nimajjanam: వినాయకుని నిమజ్జన వేడుకల్లో అపశ్రుతి.. 7 మంది మృతి

ganesh nimajjanam prime9 news

ganesh nimajjanam prime9 news

Haryana: ఏడాది ఒకసారి గణనాథునికి పెద్ద పీట వేస్తూ 11 రోజుల పాటు గణనాథుని ఉత్సవాలను అంగరంగ వైభవంగా జరుపుకుంటాము. కాగా చివరి రోజు కూడా ఏ విఘ్నాలు జరుగుకుండా ఉండాలని ప్రార్థిస్తూ విఘ్నేశుని నిమజ్జన కార్యక్రమం చేపడతాం. అయితే ఈ నిమజ్జన కార్యక్రమంలో తీవ్ర అపశ్రుతి చోటుచేసుకుంది.

హర్యానాలో వేరు వేరు చోట్ల 7 మంది వ్యక్తులు నిమజ్జనానికి అని వెళ్లి నీటిలో మునిగి మృతి చెందారు. సోనిపట్ వద్ద ముగ్గురు చనిపోగా మహేంద్రగర్హ్ లో మరో నలుగురు చనిపోయారు.

సోనిప‌ట్‌లోని మిమార్‌పూర్ ఘాట్ వ‌ద్ద వినాయ‌కుడి నిమ‌జ్జ‌నం కు వచ్చిన  ఓ వ్య‌క్తి  కుమారుడు, అల్లుడు ప్రమాదవశాత్తు నీటిలో మునిగి చనిపోయారు. వెంటనే అక్కడున్న పోలీసులు మృతదేహాలను బయటకు తీశారు. ఇక మ‌హేంద్ర‌గ‌ర్హ్‌కు స‌మీపంలోని ఓ కెనాల్‌లో గ‌ణ‌నాథుడిని నిమ‌జ్జ‌నం చేసేందుకు ఓ 9 మంది వచ్చారు. కాగా అక్క‌డ వ‌ర‌ద ఉధృతి ఎక్కువ‌గా ఉండ‌టంతో న‌లుగురు వ్య‌క్తులు నీటి ప్రవాహానికి కొట్టుకుపోయారు. శనివారం గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టిన పోలీసులు మృత‌దేహాల‌ను వెలికితీశారు.

ఈ రెండు ఘ‌ట‌న‌ల‌ పై హ‌ర్యానా సీఎం మ‌నోహ‌ర్ లాల్ ఖ‌ట్ట‌ర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. ఇది హృద‌య విదార‌క ఘ‌ట‌న అని పేర్కొంటూ, మృతుల కుటుంబాల‌కు తన ప్ర‌గాఢ సానుభూతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ స‌భ్యుల‌కు ప్ర‌భుత్వం అండ‌గా ఉంటుంద‌ని వెల్లడించారు.

ఇదీ చదవండి: బాలాపూర్ లడ్డు ధరను బ్రేక్ చేసిన మై హోమ్‌ భుజా లడ్డు

Exit mobile version