Uttar Pradesh: ఉత్తరప్రదేశ్‌లో గత మూడు రోజుల్లో వర్షాల కారణంగా కనీసం 34 మంది మరణించారు. గత 24 గంటల్లో పది మరణాలు నమోదయ్యాయి. ప్రభుత్వ గణాంకాల ప్రకారం, 34 మందిలో పిడుగుపాటుకు 17 మంది, మునిగిపోవడం వల్ల 12 మంది, భారీ వర్షాల కారణంగా సంభవించిన వరదలు మరియు కొండచరియలు విరిగిపడటంతో ఐదుగురు మరణించారు.
మృతుల కుటుంబానికి 4 లక్షల రూపాయలు..(Uttar Pradesh)
ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మృతుల కుటుంబానికి 4 లక్షల రూపాయల సహాయాన్ని ప్రకటించారు మరియు వివిధ ప్రకృతి వైపరీత్యాలలో గాయపడిన వారికి సరైన చికిత్స అందిస్తామని హామీ ఇచ్చారు.ఉత్తరప్రదేశ్‌లో ఇప్పటికే 11 శాతం అధిక వర్షపాతం నమోదైంది, దీనివల్ల నది నీటి మట్టాలు పెరిగి లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. భారత మెట్రోలాజికల్ డిపార్ట్‌మెంట్ (IMD) గణాంకాల ప్రకారం రాష్ట్రంలోని 75 జిల్లాల్లో, దాదాపు 68 జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదయింది. భారీ వర్షాల కారణంగా రాష్ట్రం గుండా ప్రవహించే గంగ, రామగంగ, యమునా, రప్తి నదుల్లో నీటిమట్టం పెరిగింది.
మరోవైపు యమునా నది నీటిమట్టం 206 మీటర్ల మార్కును తాకడంతో నది ఒడ్డున ఉన్న ప్రజలను ఖాళీ చేయిస్తామని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సోమవారం తెలిపారు. అంతకుముందు, ఢిల్లీలో ఎల్లో అలర్ట్ జారీ చేయగా మరింత వర్షం వచ్చే అవకాశం ఉన్నందున దానిని ఇప్పుడు ఆరెంజ్ అలర్ట్‌గా మార్చారు.ఈ ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా గురుగ్రామ్ మరియు నోయిడాతో సహా ఢిల్లీ-ఎన్‌సిఆర్ ప్రాంతంలోని అన్ని పాఠశాలలను మూసివేసినట్లు అధికారులు ప్రకటించారు. ఘజియాబాద్‌లో, వర్షాల కారణంగా రెండు రోజులు మరియు కన్వర్ యాత్ర కారణంగా జూలై 17 వరకు పాఠశాలలు మూసివేయబడతాయి