Site icon Prime9

Priyanka Gandhi: 220 నెలల భారతీయ జనతా పార్టీ పాలనలో 225 స్కామ్‌లు..ప్రియాంక గాంధీ

Priyanka Gandhi

Priyanka Gandhi

Priyanka Gandhi: మద్యప్రదేశ్ లో 220 నెలల భారతీయ జనతా పార్టీ పాలనలో 225 స్కామ్‌లు జరిగాయని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఆరోపించారు.సోమవారం మధ్యప్రదేశ్‌లో ఏడాది చివరి అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ ప్రచారాన్ని జబల్‌పూర్‌లో ర్యాలీతో ఆమె ప్రారంభించారు.

మూడేళ్లలో 21 ప్రభుత్వ ఉద్యోగాలు..(Priyanka Gandhi)

ఈ సందర్బంగా ప్రియాంక మాట్లాడుతూ శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని మరియు ఉద్యోగాలు కల్పించడంలో విఫలమైందని ఆరోపించారు. వ్యాపం, రేషన్ పంపిణీలో అవినీతిని ఆమె ప్రస్తావించారు. గత మూడేళ్లలో రాష్ట్రంలో కేవలం 21 ప్రభుత్వ ఉద్యోగాలు మాత్రమే బీజేపీ ప్రభుత్వం కల్పించిందన్నారు. ఈ లెక్కను నా దృష్టికి తీసుకురాగా, నా కార్యాలయం నుంచి మూడుసార్లు తనిఖీ చేయించుకున్నానని, ఇది వాస్తవమని తేలిందని ఆమె అన్నారు. చౌహాన్ ప్రభుత్వం దేవుళ్లను కూడా విడిచిపెట్టలేదని, మే 28న ఉజ్జయిని మహాకాల్ లోక్ కారిడార్‌లోని ఆరు విగ్రహాలను ధ్వంసం చేసిన గాలులను ప్రస్తావిస్తూ ఆమె వ్యాఖ్యానించారు.

మేము చాలా డబుల్ మరియు ట్రిపుల్ ఇంజన్ ప్రభుత్వాలను చూశాము, అయితే హిమాచల్ మరియు కర్ణాటక ప్రజలు ఎన్నికలలో తగిన సమాధానం ఇచ్చారని ప్రియాంక అన్నారు. బీజేపీలోకి చేరిన మాజీ కాంగ్రెస్ నేత జ్యోతిరాదిత్య సింధియా పేరును ప్రస్తావించకుండా కొంతమంది నాయకులు అధికారంకోసం పార్టీ సిద్దాంతాలను విడిచిపెట్టారని అన్నారు. సింధియాకు విధేయులైన ఎమ్మెల్యేలు మార్చి 2020లో కాంగ్రెస్‌ను విడిచిపెట్టి, కమల్‌నాథ్ ప్రభుత్వాన్ని పడగొట్టి బీజేపీ మళ్లీ అధికారంలోకి వచ్చేలా చేసిన విషయం తెలిసిందే.

Exit mobile version